ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ, ఉద్యోగాల రూపాన్ని మార్చేస్తోంది. దీని వల్ల కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆన్ లైన్ కోర్సులు కూడా పెరుగుతున్నాయి. భారత్‌లో జెనరేటివ్ AI కోర్సులు ఒక్క సంవత్సరంలోనే 107% పెరగడం, విద్యార్థులు మరియు ఉద్యోగస్తుల్లో AI పై ఆసక్తి ఎంత పెరిగిందో చూపిస్తోంది. ఈ నివేదిక ఆధారంగా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్‌లైన్ కోర్సుల ద్వారా AI నేర్చుకుంటున్నారు.

కోర్సెరా గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ 2025 ఆధారంగా, భారత్ ప్రపంచ నైపుణ్య ర్యాంకింగ్స్‌లో 89వ స్థానంలో, ఆసియా-పసిఫిక్‌లో 19వ స్థానంలో ఉంది. ముఖ్యమైన రంగాల్లో భారతీయుల నైపుణ్యం తక్కువగా ఉంది అందులో బిజినెస్‌లో 18%, టెక్నాలజీలో 22%, డేటా సైన్స్‌లో 20% మాత్రమే. అంటే, AI అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే రంగాల్లో ఇంకా పెద్ద నైపుణ్య లోటు ఉందని ఇది చూపిస్తోంది.
కోర్సెరా ఇచ్చిన AI మేచ్యూరిటీ ఇండెక్స్లో భారత్ 46వ స్థానంలో ఉంది. అంటే, AI రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయడం, ప్రతిభను పెంచడం లో భారత్‌కి ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. అంచనాల ప్రకారం, 2026 నాటికి దేశానికి సుమారు 10 లక్షల AI నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు అవసరం అని చెప్పుకొచ్చింది.
ఇందులో మహిళల భాగస్వామ్యం మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 23% పెరిగి 33 లక్షలకు చేరింది. కానీ అందులో మహిళలు మాత్రం కేవలం నాలుగులో ఒకరే ఉన్నారు. AI కోర్సుల్లో మహిళల సంఖ్య ఇంకా తక్కువ చేస్తు మొత్తం 30% మాత్రమే ఉన్నారు. ఇది టెక్ రంగంలో ఇంకా మహిళల సంఖ్య తక్కువగానే ఉందని చూపిస్తోంది.
భారతీయ కోర్సెరా వినియోగదారుల్లో 52% మంది మొబైల్ ద్వారా చదువుకుంటున్నారు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిందనీ, ఎక్కడైనా సులభంగా నేర్చుకునే విధానాలు ప్రజల్లో ప్రసిద్ధి పొందుతున్నాయనీ చూపిస్తుంది.
ఇక, భారతీయ విద్యార్థులు ఫుల్-స్టాక్ డెవలప్మెంట్, డెవ్ఆప్స్, కంటైనరైజేషన్ వంటి ఆధునిక టెక్ నైపుణ్యాలను ఎక్కువగా నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో కోర్సెరా విద్యార్థులు 3.1 కోట్లు ఉండగా, వారి సగటు వయస్సు 31 సంవత్సరాలు. ఈ సంఖ్య యూరప్ మొత్తం కంటే ఎక్కువ, రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచ డిజిటల్ ఉద్యోగాల్లో పెద్ద పాత్ర పోషించనుందని అర్థం.
AI నైపుణ్యాలు తక్కువగా ఉండటం వల్ల భారతదేశం గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్లో తన పోటీ శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రపంచంలోని అనేక దేశాలు కొత్త AI సాధనాలు, సాంకేతికతలు వేగంగా అలవర్చుకుంటుండగా, మన ప్రొఫెషనల్స్ వెనుకబడితే ఆ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఇతర దేశాలకు మళ్లిపోతాయి. అలాగే సరైన నైపుణ్యాలు లేని ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉంటే, కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను తీసుకువస్తాయి. దీని వలన దేశీయ ప్రతిభకు తక్కువ అవకాశాలు దొరకడం, ఉద్యోగ పోటీ మరింత పెరగడం జరుగుతుంది.
భారతదేశం మంచి నైపుణ్యాలు పెంచుకోవడానికి ఫలితాలపై దృష్టి పెట్టాలి, ప్రభుత్వం-ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాలి, అలాగే సాంకేతిక రంగాల్లో మరింత మంది మహిళలు చేరేందుకు ప్రయత్నించాలి. కొత్త తరం ఉద్యోగులకి శిక్షణ ఇస్తే, భారత్ తన స్థానం ప్రపంచంలో మరింత బలపరచుకోగలదు.
More From GoodReturns

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications