2019 కంటే భారత జీడీపీ తక్కువ, 2020లో చైనా అదుర్స్
2019 కంటే 2021లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిగువనే ఉండవచ్చునని యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్(UNESCAP) అంచనా వేసింది. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వేగవంతమైనప్పటికీ వివిధ కారణాలతో వృద్ధి దిగువనే ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ ఐక్య రాజ్య సమితి తాజా నివేదిక పేర్కొంది. 'ఎకనమిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఏషియా అండ్ ది పసిఫిక్ 2021: టువార్డ్స్ పోస్ట్ కోవిడ్ 19 రిసైలెంట్ ఎకానమీస్' పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత వృద్ధి రేటు అంచనాలు వెల్లడించింది.

7 శాతంగా ఉండవచ్చు
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉండవచ్చునని పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను మైనస్ 7.7 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద లాక్ డౌన్ భారత్‌లో కొనసాగిందని, దీంతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని పేర్కొంది. FY21లో మొదటి త్రైమాసికం నుండి రెండో త్రైమాసికం వరకు ఈ ప్రభావం పడింది. లాక్ డౌన్‌తో పాటు దానిని ఎత్తివేసిన తర్వాత కూడా ప్రజల ఆరోగ్యం కొరకు ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. దీని వల్ల కరోనా ప్రభావం, కేసులు తగ్గినట్లు వెల్లడించింది. అయితే ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడినట్లు తెలిపింది.

కరోనా.. వ్యాక్సినేషన్
వాస్తవానికి వృద్ధిరేటు నిరాశావహంగా ఉన్న స్థితిలోనే భారత్‌లోకి కొవిడ్ 19 ప్రవేశించిందనే అంశాన్ని కూడా నివేదిక పొందుపరిచింది. తదుపరి దశలో వృద్ధిరేటు మరింతగా క్షీణిస్తూ రెండో త్రైమాసికంలో మైనస్ 23.9 శాతం క్షీణతను నమోదు చేసింది. నాలుగో త్రైమాసికం జీడీపీ మాత్రం జీరోకి చేరువలో ఉంటుందని భావిస్తున్నారు. కఠిన లాక్‌డౌన్ క్రమంగా సడలిస్తూ రావడం, కొత్త కేసుల తగ్గుదల, వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటికీ వర్తమాన స్థితిలో జీడీపీ వృద్ధిరేటు 2019 కన్నా తక్కువగానే ఉంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. FY21లో నాలుగవ త్రైమాసికంలో మాత్రం 6.5 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేయవచ్చునని అంచనాల్లో తెలిపింది.

చైనా ఫస్ట్
నాన్-పర్ఫార్మింగ్ లోన్స్ అతి పెద్ద సవాల్ అని తెలిపింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) FY21లో భారత వృద్ధి రేటు అంచనాలను 8 శాతంగా అంచనా వేశాయి. 2020లో ప్రపంచంలోనే కాస్త పాజిటివ్ వృద్ధి రేటు నమోదు చేసిన దేశం చైనా. బలమైన ఆర్థిక రికవరీ, పారిశ్రామిక ఉత్పత్తి పెరగడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అం్ హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్, మర్చంటైజ్డ్ ఎక్స్‌పోర్ట్స్ వంటి వివిధ అంశాలు దోహదపడ్డాయి.


Click it and Unblock the Notifications