రష్యా చమురు కొనుగోళ్లు భారత్ ఆపేసిందంటూ ట్రంప్ ప్రకటన.. దీటుగా బదులిచ్చిన రెండు దేశాలు, ఏమన్నాయంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వాణిజ్యరంగంలో చర్చలకు కేంద్ర బిందువుగా మారాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తారని తనకు హామీ ఇచ్చినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యా మద్దతు ఇవ్వడాన్ని తగ్గించడంలో ఇది ఒక కీలక అడుగుగా అని ట్రంప్ అభివర్ణించారు.
ఈ వ్యాఖ్యలపై భారత్, రష్యా ప్రభుత్వాలు తమదైన స్టైల్లో అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి.భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు కీలకమైనదని. రష్యా, డిస్కౌంట్‌పై భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్నదని, దాంతో తమకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతోందని రష్యా స్పష్టం చేసింది.

భారత్ కేంద్ర విదేశాంగ శాఖ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని తెలిపింది. కేంద్ర విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఓ ప్రకటనలో.. భారత్ భారీగా చమురు, గ్యాస్ దిగుమతులు కొనసాగిస్తుంది. అంతర్జాతీయ ఇంధన ధరల అస్థిరత మధ్య, మా దేశ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రథమ లక్ష్యం. దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యానికి అనుగుణంగా ఉంటాయి. స్థిరమైన ఇంధన ధరలు, సురక్షిత సరఫరా.. ఇవే మా విధాన ప్రధాన లక్ష్యాలని అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యల తన వ్యాఖ్యల్లో.. మోదీని గొప్ప వ్యక్తిగా గుర్తిస్తూ తన స్నేహితుడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మాస్కో నుంచి Oil కొనడం వల్ల ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించడానికి పుతిన్ ఆ నిధులను ఉపయోగిస్తున్నారని, దీన్ని తాము ఆపడానికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అలాగే, చైనా కూడా రష్యా చమురును కొనకూడదని ముందస్తు సంకేతం ఇచ్చిందని ట్రంప్ తెలిపారు.
భారత్-అమెరికా ఇంధన సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ట్రంప్ వ్యాఖ్యలలో ప్రతిబింబించింది. ఇంధన విధానంపై భారత్, అమెరికా మధ్య కొంత ఘర్షణ ఉన్నప్పటికీ, భారత్ యూఎస్‌కు సన్నిహిత భాగస్వామి. ప్రధాని మోదీ చాలా కాలంగా అధికారంలో ఉండటం ద్వారా రాజకీయ స్థిరత్వాన్ని నిలబెట్టారని ట్రంప్ అన్నారు. అయితే రష్యా-భారత్ ఇంధన సంబంధాలపై, కేంద్ర ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని తెలిపింది. భారతదేశం ఇంధన దిగుమతుల విషయంలో పూర్తి స్వతంత్ర విధానాన్ని పాటిస్తుంది, దాని నిర్ణయాలు దేశీయ అవసరాలకే అనుగుణంగా ఉంటాయి. భారత భద్రత, వినియోగదారుల ప్రాధాన్యత, మార్కెట్ స్థిరత్వం.. ఇవే ప్రధాన కారణాలుగా ఉంటాయని భారత్ తెలిపింది.
ఈ ఘటన అంతర్జాతీయ దృష్టిలో భారతదేశం స్థిరమైన, స్వతంత్ర, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న దేశంగా ఉన్నదని స్పష్టం చేస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలు, రష్యా-భారత్-అమెరికా మధ్య ఇంధన వ్యూహాలను చర్చనీయాంశంగా మార్చాయి. ఈ చర్చలు భవిష్యత్తులో గ్లోబల్ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications