భారత్- రష్యా మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి, డిసెంబర్ 4-5 తేదీలలో న్యూఢిల్లీ.. మెగా ఇండియా-రష్యా బిజినెస్ ఫోరమ్‌కు ఆతిథ్యమివ్వడానికి రెడీ అవుతోంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనతో సమానంగా జరుగుతున్న ఈ ఫోరం.. రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించే అవకాశాన్ని అందించబోతోంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఫోరం కొనసాగనుంది.
ఈ ఫోరం కీలకంగా ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆహార & సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, డిజిటల్ సేవలు, ఔషధ & మెడ్‌టెక్ పరిశ్రమల్లో భాగస్వామ్యం పెంపు మీద ప్రధానంగా దృష్టి పెట్టనుంది. భారతీయ ఇంజనీరింగ్ ఉత్పత్తుల రష్యన్ మార్కెట్లో ఉనికిని విస్తరించడం, రష్యా భారతదేశం నుండి మరింత ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేయడం, డిజిటల్ సేవల పరస్పర అందుబాటు, ఔషధ ఉత్పత్తుల రష్యన్ కొనుగోళ్లు పెంపు వంటి అంశాలు చర్చలో ప్రధానంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఫోరమ్‌లో భారతీయ సరఫరాదారుల ఉనికిని రష్యాలో పెంచడం, ఉమ్మడి పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో భాగస్వామ్యాన్ని విస్తరించడం వంటి అంశాలు అజెండాలో ఉన్నాయి. రష్యా, భారతదేశం నుండి నైపుణ్యంతో కూడిన మానవ వనరులను ఆకర్షించడానికి ఆసక్తి చూపుతోంది. రష్యాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా పెరుగుతుండటం దీనికి నిదర్శనం.
ఔషధ పరిశ్రమలో భాగస్వామ్యం రెండు దేశాలకు అత్యంత వ్యూహాత్మకంగా పరిగణించబడుతోంది. రష్యన్ మార్కెట్లో భారతీయ ఔషధాల సరఫరాను పెంచడం, రష్యాలో భారతీయ కంపెనీల ఔషధ ఉత్పత్తిని స్థానికీకరించడం, అత్యాధునిక మెడ్‌టెక్ తయారీ యూనిట్లను కలిసి ఏర్పాటు చేయడం వంటి అంశాలు రెండు దేశాల ఆరోగ్య సంరక్షణ పరిజ్ఞానాలను మరింత బలోపేతం చేయనున్నాయి. ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అవసరమైన నియంత్రణ విధానాలు, పెట్టుబడి వ్యవస్థలపై చర్చించబడుతుంది.
భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కేలబుల్ సాఫ్ట్‌వేర్, AI ఆధారిత పరిష్కారాలలో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. రష్యా శాస్త్రీయ పరిశోధన, రక్షిత కమ్యూనికేషన్, అధునాతన కంప్యూటింగ్ రంగాలలో బలమైన అనుభవం కలిగి ఉంది. ఈ రెండు బలాలు కలిసితే, ఉమ్మడి డిజిటల్ అభివృద్ధి, AI పరిశోధనలకు విస్తృత అవకాశాలు లభిస్తాయని అధికారులు అంటున్నారు. డిజిటల్ టెక్నాలజీలలో సహకారం కోసం ప్రాధాన్యతా మార్గాలను గుర్తించడం ఈ ఫోరం ముఖ్య లక్ష్యం.
భారతీయ నైపుణ్య కార్మిక శక్తిని రష్యాలో మరింతగా ఉపాధిలోకి తీసుకోవడానికి ఒక మోబిలిటీ అగ్రిమెంట్ పై సంతకాలు జరగనున్నాయి. రష్యాలో వివిధ నగరాల్లో భారతీయ నిపుణుల అవసరం పెరుగుతుండటంతో, ఇది రెండు దేశాలకు పరస్పర ప్రయోజనకర అవకాశం కలిగించనుంది.
ఇటీవలి కాలంలో రష్యాకు కూరగాయలు, ఆకుకూరలు, రెడీమేడ్ మీల్స్, స్నాక్స్, మిఠాయిలు, వెన్న, పాల కొవ్వు, ద్రాక్ష వంటి భారతీయ వస్తువుల ఎగుమతి పెరిగింది. అమెరికా సుంకాల కారణంగా సీఫుడ్ ఎగుమతిదారులు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో..భారతీయ రొయ్యలను రష్యాకు ఎగుమతి చేయడం పై చర్చలు కొనసాగుతున్నాయి. మూడు పదార్థాలు అయిన..మిల్లెట్లు, సాంప్రదాయ స్వీట్లు సముద్ర ఆహారం వంటివి రష్యాలో భారీ అవకాశాలు కలిగి ఉన్నాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications