వరల్డ్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో భారత్ ఆరు స్థానాలు మెరుగు పరుచుకొని, 43వ స్థానం నుండి 37వ స్థానానికి ఎగబాకింది. ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ సంకలనం చేసిన యాన్యువల్ వరల్డ్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో భారత్ పుంజుకుంది. ఆసియా ఆర్థిక వ్యవస్థలలో అత్యంత చురుగ్గా పెరుగుదలను నమోదు చేసిన దేశాల్లో భారత్ ముందు ఉన్నది.
అరవై దేశాల జాబితాలో డెన్మార్క్ గత ఏడాది మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది. స్విట్జర్లాండ్ గత ఏడాది టాప్ ర్యాంకింగ్ నుండి రెండో స్థానానికి పడిపోయింది. సింగపూర్ ఐదో స్థానం నుండి మూడో స్థానానికి ఎగబాకింది. టాప్ టెన్ దేశాల్లో స్వీడన్ నాలుగో స్థానంలో, హాంగ్ కాంగ్ ఐదో స్థానంలో, నెదర్లాండ్స్ ఆరో స్థానంలో, తైవాన్ ఏడో స్థానంలో, ఫిన్‌లాండ్ ఎనిమిదో స్థానంలో, నార్వే తొమ్మిదో స్థానంలో, అమెరికా పదో స్థానంలో నిలిచాయి.

ఆసియా నుండి సింగపూర్ మూడో స్థానంలో ఉండగా, హాంగ్ కాంగ్ 5వ స్థానంలో, తైవాన్ 7వ స్థానంలో, చైనా 17వ స్థానంలో, ఆస్ట్రేలియా 19వ స్థానంలో నిలిచాయి. ఆర్థిక వ్యవస్థ పని తీరులోని ప్రతిఫలాలు భారత్ ర్యాంకు మెరుగు అయ్యేందుకు దోహదం చేసినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్(IMD) తెలిపింది. వ్యాపార సామర్థ్య పారామీటర్లలో కీలకమైన లేబర్ మార్కెట్ 15వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకుంది. నిర్వహణ పద్ధతులు, వ్యాపార వ్యాల్యూస్ కీలకంగా మారాయని, ప్రధాని మోడీ ఆధ్వర్యంలో రెట్రోస్పెక్టివ్ పన్నుల్లో మెరుగులు దిద్దడం వ్యాపార రంగంలో నమ్మకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications