స్విస్ బ్యాంకు నుండి మూడో జాబితా విడుదల, తదుపరి జాబితా 2022 సెప్టెంబర్‌లో..
స్విస్ బ్యాంకు భారతీయ కుబేరుల మూడో జాబితా విడుదలైంది. 96 దేశాలకు చెందిన 33 లక్షల ఆర్థిక ఖాతాల వివరాలను తాజాగా వెల్లడించింది. ఇందులో భారత్ మూడో జాబితా విడుదలైంది. స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (FTA) ప్రకారం ఈసారి మరో పది దేశాలు జత కలిశాయి. ఇలా కలిసిన దేశాల్లో ఆంటిగ్వా, బార్డుడా, అజెర్బజన్, డొమినికా, ఘనా, లెబనాన్, పాకిస్తాన్, ఖతార్, సమోవా, వౌటు కలిశాయి.
మరో పది దేశాలతో సమాచార మార్పిడిని చేసుకున్నట్లు ఫెడరల్ ట్యాక్స్ అడ్మిషినిస్ట్రేషన్(FTA) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. 96 దేశాలకు చెందిన ఖాతాదారుల పేర్లు, ఇతర వివరాలను FTA బహిర్గతం చేయలేదు. ఇక భారత్ వరుసగా మూడో ఏడాది తమ దేశానికి చెందిన స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాల్ని అందుకుంది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల్లో పెద్దసంఖ్యలో ఖాతాదారులైన భారతీయ వ్యక్తులు, కంపెనీల వివరాలు ఉన్నాయి.

స్విట్జర్లాండ్‌తో ఒప్పందంలో భాగంగా 2022 సెప్టెంబర్ నెలలో తదుపరి భారతీయ ఖాతాదారుల సమాచారాన్ని ఆ దేశం భారత్‌తో పంచుకోనుంది. స్విస్ నుండి మొదటి జాబితాను 2019 సెప్టెంబర్ నెలలో అందుకుంది. అప్పుడు 75 దేశాలు స్విస్ అకౌంట్ నుండి జాబితాను పొందాయి. గత ఏడాది 86 దేశాలతో జాబితాను పంచుకుంది.


Click it and Unblock the Notifications