Rare Earth Minerals: చైనాకు చెక్! ఖనిజాల ఆట మొదలుపెట్టిన భారత్! త్వరలో సూపర్ పవర్ కానుందా?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏ దేశం చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), క్లీన్ ఎనర్జీ, హై-టెక్ గ్యాడ్జెట్ల గురించే మాట్లాడుతోంది. అయితే వీటన్నింటి తయారీలో అత్యంత కీలకమైనవి రేర్ ఎర్త్ మినరల్స్ (Rare Earth Minerals) అంటే.. అరుదైన ఖనిజాలు అని అర్థం. ఇప్పటివరకు ఈ ఖనిజాల విషయంలో చైనాదే పైచేయి. ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్న చైనా గుత్తాధిపత్యానికి తెరదించేందుకు భారత ప్రభుత్వం ఇప్పుడు ఒక భారీ అడుగు వేసింది.

దేశీయంగా రేర్ ఎర్త్ మినరల్స్ (Rare Earth Minerals) వినియోగాన్ని పెంచడమే కాకుండా.. వాటి ద్వారా తయారయ్యే శక్తివంతమైన అయస్కాంతాల (Magnets) ఉత్పత్తి కోసం ఏకంగా రూ. 7,280 కోట్ల భారీ పథకాన్ని కేంద్రం ప్రకటించింది.
ఏమిటీ రేర్ ఎర్త్ మినరల్స్? ఎందుకంత డిమాండ్?
నిజానికి ఇవి భూమిలో అరుదుగా దొరికేవి కావు. కానీ, వీటిని వెలికితీసి శుద్ధి చేయడం చాలా ఖరీదైన , కష్టమైన పని. స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, జెట్ ఇంజన్లు, విండ్ టర్బైన్లు , ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల మోటార్లలో వాడే 'నియోడైమియం' (NdFeB) వంటి పర్మనెంట్ మ్యాగ్నెట్ల తయారీకి ఈ ఖనిజాలు (Rare Earth Minerals) ప్రాణం వంటివి. ఇప్పటివరకు భారత్ ఈ అయస్కాంతాల కోసం చైనా మీదనే ఆధారపడుతోంది. ఈ డిపెండెన్సీని తగ్గించి, భారత్‌ను గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడమే ఈ పథకం లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వ భారీ ప్లాన్ ఇదే!
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రూ. 7,280 కోట్ల నిధులను ఖనిజాల (Rare Earth Minerals) నుండి తయారయ్యే మేగ్నెట్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. ఏటా 6,000 మెట్రిక్ టన్నుల మ్యాగ్నెట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే ఈ పథకం లక్ష్యం. దీనికోసం గ్లోబల్ టెండర్ల ద్వారా ఐదు కంపెనీలను ఎంపిక చేస్తారు. దీనివల్ల కంపెనీలకు రెండు రకాలుగా లాభం చేకూరుతుంది. ఒకటి - ప్లాంట్ పెట్టడానికి ఇచ్చే 'కాపిటల్ సబ్సిడీ', రెండు - అమ్మకాలపై ఇచ్చే 'సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్'.
ఖజానా ఉన్నా ఎందుకు వెనుకబడ్డాం?
భారత్ దగ్గర ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఖనిజ నిల్వలు ఉన్నాయి. మన సముద్ర తీర ప్రాంతాల్లో ఇవి పుష్కలంగా దొరుకుతాయి. కానీ, మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే.. భూమిలోంచి ఖనిజాన్ని తీయడం (Mining) తెలుసు. కానీ, దాన్ని మెటల్‌గా, ఆపై హై-టెక్ మ్యాగ్నెట్‌గా మార్చే సాంకేతికత (Processing) మన దగ్గర తక్కువగా ఉంది.
ఇన్నాళ్లూ మనం ముడి పదార్థాలను ఎగుమతి చేస్తూ.. తయారైన వస్తువులను చైనా నుండి దిగుమతి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త పథకం ఆ గ్యాప్‌ను భర్తీ చేస్తుంది. అంటే ఇకపై మనం కేవలం ముడి పదార్థాల దేశంగా కాకుండా, "ఫినిష్డ్ ప్రొడక్ట్స్" తయారు చేసే దేశంగా ఎదుగుతాం.
భారత్ సూపర్ పవర్ అవుతుందా?
ఈ ప్రాజెక్ట్ గడువు 7 ఏళ్లు. ఇందులో మొదటి 2 ఏళ్లు ప్లాంట్ నిర్మాణానికి, మిగిలిన 5 ఏళ్లు ఉత్పత్తికి కేటాయించారు. ఏదైనా కంపెనీ రెండేళ్ల కంటే ముందే ప్రొడక్షన్ మొదలుపెడితే వారికి అదనపు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అటామిక్ ఎనర్జీ విభాగం పరిధిలోని 'IREL (India) Limited' ఈ కంపెనీలకు అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడమే కాకుండా.. రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్ ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధి) సాధిస్తుంది. చైనాకు గట్టి పోటీ ఇస్తూ భారత్ ఈ రంగంలో గ్లోబల్ సూపర్ పవర్ అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి!


Click it and Unblock the Notifications