కరోనా దెబ్బ, సౌదీ-రష్యా చమురు యుద్ధం: ఇండియా బడా ప్లాన్!
అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలు గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాలు లాక్ డౌన్ లేదా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు, రవాణా వ్యవస్థ స్తంభించడంతో చమురుకు డిమాండ్ తగ్గింది. అదే సమయంలో ఇటీవల రష్యా-సౌదీ అరేబియా నేతృత్వంలోని యూఏఈ మధ్య ధరల యుద్ధం నడిచింది. దీంతో 20 డాలర్లకు కూడా పడిపోయింది. ఒపెక్ దేశాల సమావేశం నేపథ్యంలో డీల్ కుదురుతుందనే అంచనాలతో ధరలు కాస్త పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చమురు నిల్వలపై ప్లాన్‌తో ముందుకెళ్తోంది.

భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచుకునే దిశగా
ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 30 డాలర్లకు పైన ఉంది. ఇది భారత్‌కు గొప్ప అవకాశంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో భూగర్భంలోని వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవాలని భావిస్తోంది భారత్.

సరఫరా లేద ధరలను అధిగమించేందుకు
ఇందుకు సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్ వంటి దేశాల నుంచి ముడి చమురును మరింతగా దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది భారత్. దీంతో భవిష్యత్తులో సరఫరా లేదా ధరలకు సంబంధించిన ఇబ్బందులను అధిగమించే అవకాశముంది.

భారత్ నిల్వ సామర్థ్యం
భారత్ అత్యవసరాల కోసం 53.3 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నిల్వలు దాదాపు 9.5 రోజులకు సరిపోతాయి. కర్ణాటకలోని మంగళూరు, పాదూర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో భూగర్భ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ నిల్వలు సగం ఖాళీగా ఉన్నాయి.

మళ్లీ డిమాండ్ పెరగవచ్చు
సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్ దేశాల నుండి కొనుగోలు చేసిన చమురుతో వీటిని నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి చమురు ధరలు ఏకంగా 60 శాతం క్షీణించాయి. ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే చమురుకు డిమాండ్ పెరగవచ్చు.

చమురు కోసం నిధులు పక్కకు..
చమురు దిగుమతులు పెంచుకునేందుకు సౌదీ అరేబియా, యూఏఈ ప్రతినిధులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొద్ది రోజుల క్రితం చర్చలు కూడా జరిపారు. చమురు కోసం కేంద్ర ఆర్థిక శాఖ నిధులు పక్కన పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. రూ.48 నుండి రూ.50 బిలియన్లు విడుదల చేయాలని ఆయిల్ మినిస్ట్రీ.. ఫైనాన్స్ మినిస్ట్రీని ఇదివరకే కోరిందట.

వ్యూహాత్మక చమురు నిల్వలు
భారత్ చమురు కన్సంప్షన్‌లో 80 శాతం దిగుమతుల ద్వారా వచ్చేవే. దక్షిణాదిన ఉన్న మూడు స్టోరేజ్ ప్రాంతాల్లో స్టోర్ చేస్తుంది. ఓ వైపు వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచుకునేందుకు ఇండియా సిద్ధమవుతోంది. మరోవైపు, దేశంలోని అత్యవసర నిల్వలను తక్కున ధరలు పూరించేందుకు ఉపయోగించుకుంటానని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications