For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలసరి ఆదాయం రూ.1.5 లక్షలు, కరోనా ముందుస్థాయికంటే తక్కువ

|

2021-22 వార్షిక తలసరి ఆదాయం రూ.1.5 లక్షలుగా ఉందని ఎన్ఎస్ఓ వెల్లడించింది. 2020-21లో నమోదైన రూ.1,26,855తో పోలిస్తే ఇది 18.3 శాతం ఎక్కువ. తలసరి ఆదాయం ఇప్పటికీ కరోనా ముందుస్థాయి కంటే తక్కువగా ఉంది. 2019-20లో తలసరి ఆదాయం రూ.1.32 లక్షలుగా ఉంది. స్థిర ధరల వద్ద తలసరి వార్షిక ఆదాయం FY21లోని రూ.85,100తో పోలిస్తే FY22లో 7.5 శాతం పెరిగి రూ.91,481గా నమోదయింది. కరోనాకు ముందు అంటే అంటే FY20లో ఇది రూ.94,270. FY21లో రూ.85,110కి పరిమితమైంది.

ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. దేశ ఆర్థిక రంగం సరైన స్థితిలో ముందుకు వెళ్తుండటం వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. భారత్‌కు స్టాగ్‌ఫ్లేషన్ ముప్పు అవకాశాలు తక్కువ అని తెలిపింది. దేశంలో కీలక 8 మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి ఏప్రిల్ నెలలో 8.4 శాతంగా నమోదయింది.

India’s per capita income remains below pre-COVID level in 2021-22

ఇది ఆరు నెలల గరిష్టం. 2021 అక్టోబర్ నెలలో నమోదైన 8.7 శాతం తర్వాత ఇది గరిష్టం. రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాలు మెరుగైన పనితీరును కనబరిచాయి. మార్చిలో కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి 4.9 శాతంగా నమోదయింది.

ఇదిలా ఉండగా, 2022 క్యాలెండర్ ఏడాదికి భారత వృద్ధి అంచనాలను సవరించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి కసరత్తు చేస్తోంది. 9 శాతం వృద్ధి రేటు లభిస్తుందని జనవరిలో అంచనా వేసిన ఐఎంఎఫ్, ఏప్రిల్‌లో దానిని 8.2 శాతానికి సవరించింది. 2023లో 6.9 శాతం నమోదు కావొచ్చునని పేర్కొంది. అయితే ఇప్పుడు 2022 వృద్ధి అంచనాలు సవరించే అవకాశముంది.

English summary

తలసరి ఆదాయం రూ.1.5 లక్షలు, కరోనా ముందుస్థాయికంటే తక్కువ | India’s per capita income remains below pre-COVID level in 2021-22

Annual per capita income at constant prices remained below the pre-COVID level at Rs 91,481 in 2021-22, official data showed on Tuesday.
Story first published: Wednesday, June 1, 2022, 8:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X