Laptop imports: పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతులను భారత ప్రభుత్వం ఇటీవల నిలిపివేసింది. చైనా పేరు ప్రస్తావించక పోయినా.. అక్కడి నుంచి ఇంపోర్ట్స్‌ను నియంత్రించేందుకు గాను దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కొత్త నిబంధనలు పాటించాలని హుకుం జారీచేసింది.
ఈ ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై ఇండియా నిషేధం విధించడంతో.. పునరాలోచించాలని పలు కంపెనీలు, ఆయా సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. కాగా ల్యాప్‌టాప్‌లు, PCలు, సర్వర్లు వంటి పూర్తి IT హార్డ్‌వేర్లను విశ్వసనీయ ప్రాంతాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ సర్కారు తెలిపింది. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

అయితే భారత్, చైనా మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభన నేపథ్యంలో.. ఇండియా ఈ స్టెప్ తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే చైనాను ట్రస్టెడ్ రీజియన్‌గా గుర్తించే అవకాశం ఉండదు. కాబట్టి అక్కడి నుంచి దేశంలోకి వస్తున్న దిగుమతులను అడ్డుకోవడమే భారత్ ప్లాన్ అని చెబుతున్నారు.
ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతికి లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఇటీవల కేంద్రం ప్రయత్నించింది. అక్టోబర్ 31 నుంచి చిన్న టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఆల్ ఇన్ వన్ PCలు సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఇంపోర్ట్ చేసుకోవడానికి లైసెన్స్ అవసరం కానుంది. 'IT హార్డ్‌వేర్‌తో పాటు PCల ఉత్పత్తికి భారత్ సిద్ధమవుతోంది. దేశీయ అవసరాలు తీర్చుకోవడానికి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం' అని ఎలక్ట్రానిక్స్ మరియు IT శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ధృవీకరించారు.


Click it and Unblock the Notifications