For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్షలాదిమందిని పేదరికం నుంచి బయటపడేశారు కానీ! మోడీ ప్రభుత్వానికి ఐఎంఎఫ్

|

ప్రపంచ వృద్ధి రేటు ఇంజిన్లలో ఒకటిగా ఉన్న భారత్‌లో ఆర్థిక మందగమనం ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ వెంటనే మరిన్ని చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF-ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) సోమవారం పేర్కొంది. వినియోగం తగ్గడం, పెట్టుబడులు సన్నగిల్లడం, ట్యాక్స్ రెవెన్యూలు పడిపోవడం వంటి వివిధ కారణాలతో ప్రపంచంలో ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్ మందగమనానికి బ్రేకులు వేయాలని IMF తన వార్షిక సమీక్షలో అభిప్రాయపడింది.

2 బిలియన్ డాలర్ల మేర హరించిన రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ2 బిలియన్ డాలర్ల మేర హరించిన రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ

లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేశారు కానీ...

లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేశారు కానీ...

నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరికొత్త పథకాలు, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్ద లక్షలాది కుటుంబాలను పేదరికం నుంచి బయట పడేశాయని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ... లక్షలాది మందిని పేదరికం బారి నుంచి బయట పడవేసిన అనంతరం, ఇప్పుడు మాత్రం భారత్ ఆర్థిక మందగమనంలోకి వెళ్లిపోయిందని IMFకు చెందిన రణీల్ సాల్గాడో అన్నారు. వృద్ధి చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థకు తక్షణమే చర్యలు చేపట్టాలని పేర్కొంది.

మందగమనాన్ని పరిష్కరించాలి

మందగమనాన్ని పరిష్కరించాలి

ప్రస్తుత మందగమనాన్ని తిప్పికొట్టేందుకు, భారత్‌ను తిరిగి వృద్ధి మార్గంలోకి తీసుకు రావడానికి వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని IMF పేర్కొంది. వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం వద్ద పరిమిత మార్గాలు ఉన్నాయని, అందుకు అధిక రుణస్థాయి, వడ్డీ చెల్లింపులు కారణమని పేర్కొంది. IMF చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ గత వారం భారత ఆర్థిక మందగమనంపై స్పందించారు. మందగమనం భారీగా దిగజారిందన్నారు. వృద్ధి అంచనాలు తగ్గిపోవచ్చునని చెప్పారు.

ఉద్యోగాలు రాలేదు..

ఉద్యోగాలు రాలేదు..

ఇటీవల భారత్ వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని, కానీ ఇది వివిధ రంగాలలో ఉద్యోగాల పెరుగుదలకు దారి తీయలేదని IMF పేర్కొంది. లేబర్ మార్కెట్ పార్టిసిపేషన్ తగ్గిపోయిందన్నారు. ఇటీవలి లేబర్ మార్కెట్ డేటా ప్రకారం నిరుద్యోగం భారీగా పెరిగింది. అదే సమయంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ తగ్గింది. ముఖ్యంగా మహిళలకు తగ్గిందని పేర్కొంది.

English summary

లక్షలాదిమందిని పేదరికం నుంచి బయటపడేశారు కానీ! మోడీ ప్రభుత్వానికి ఐఎంఎఫ్ | India must act quickly to reverse economic slowdown: IMF

India must take steps quickly to reverse the economic slowdown of an economy that has been one of the engines of global growth, the International Monetary Fund said on Monday.
Story first published: Tuesday, December 24, 2019, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X