కరోనా దెబ్బకు చైనా విల విల లాడుతోంది. ప్రపంచం గజగజ వణికిపోతోంది. కరోనా వైరస్ వచ్చినప్పుడు అది కేవలం ఒక్క చైనాకే పరిమితం అనుకున్నారు అంతా. కానీ, ఈ మహమ్మారి ఒక్కో దేశాన్నే దాటుకుంటూ ప్రస్తుతం మన గడప వరకూ వచ్చేసింది. దీంతో ఇండియా సహా ప్రపంచ దేశాలు మాస్కులు, మందుల గురించి ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే 3,000 కు పైగా మంది మరణానికి కారణమైన కరోనా వైరస్ ... మరో లక్ష మందికి పైగా సోకి హడలెత్తిస్తోంది.
దీంతో కరోనా చికిత్సకు వాడే మందుల గురించే నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, యూరోప్ దేశాల్లో కరోనా వైరస్ కు విరుగుడు వాక్సిన్ తయారు చేసేందుకు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, అసలు విషయం ఏమిటంటే చైనా లో గనుక పరిస్థితులు సిద్దమనుగకుంటే ... త్వరలోనే జ్వరానికి వాడే పారాసెటమాల్ మాత్రలకు కరువొచ్చేలా ఉంది. ఎందుకంటే, ఇండియా సహా ప్రపంచ దేశాలన్నీ పారాసెటమాల్ ముడి సరుకుల కోసం చైనా పైనే ఆధారపడతాయి. వీటితో పాటు చాలా వరకు యాంటీ బయోటిక్స్ తయారీకి కూడా ముడి పదార్థాలు చైనా నుంచే రావాలి.

2.5 బిలియన్ డాలర్ల దిగుమతులు...
భారత ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అలాగే ఐదో అతిపెద్ద మార్కెట్ కూడా. మొత్తం ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ సుమారు రూ 2 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో సగం వరకు మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే, మన దేశ కంపెనీలు ఫార్మా తుది మాత్రలు తయారు చేసేందుకు మాత్రం చైనా పైనే అధికంగా ఆధారపడతాయి. భారత దేశం ఏటా సుమారు 3.5 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ముడిసరుకులు (ఏ పీ ఐ ) దిగుమతి చేసుకుంటుండగా... అందులో 2.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ 17,500 కోట్లు) విలువైన ముడిసరుకులు ఒక్క చైనా నుంచే వస్తున్నాయి. దీంతో, మన ఫార్మా పరిశ్రమ పూర్తిగా చైనా పైనే ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే విషయం ఆందోళన కలిగిస్తోంది.

2-3 నెలలకే స్టాక్స్...
సాధారణంగా తయారీ కంపెనీలు ఏవైనా సుమారు 3 నెలల కాలానికి సరిపడేలా ముడిసరుకులు నిల్వ చేసుకుంటాయి. ఫార్మా ఇండస్ట్రీ కూడా ఇలాగే చేస్తుంది. మన దేశంలో ఉన్న అన్ని ఫార్మా కంపెనీల వద్ద నిల్వలు మరో 2-3 నెలల వరకే సరిపోతాయి. ఆ లోగా చైనా లో కరోనా తగ్గుముఖం పట్టాలి. లేదంటే పరిస్థితి అదుపు తప్పటం ఖాయమని ఇండస్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో తయారు చేసే పారాసెటమాల్ మాత్రలు, యాంటీ బయోటెక్ మందులు అన్ని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకులు నుంచే తయారు చేస్తారు. వీటిని మన దేశంలో వినియోగించటంతో పాటు, అమెరికా, యూరోప్ సహా ప్రపంచ దేశాలన్నిటికీ సరఫరా చేస్తారు. ఒక వేళ చైనా లో అనుకున్న సమయానికి పరిస్థితులు చక్కబడకపోతే మాత్రం... ఇటు ఇండియా, అటు మన పైన ఆధారపడిన ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.

ప్రత్యామ్నాయాలు తక్కువే...
గత 20-30 ఏళ్లుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఔషధాల కోసం అయితే చైనా, లేదా ఇండియా పై ఆధారపడుతున్నాయి. చైనా నుంచి అధికంగా బల్క డ్రగ్స్ ఎగుమతులు జరిగితే.. ఇండియా నుంచి ఫార్ములేషన్స్ ( మెడిసిన్) అధికంగా ఎగుమతి అవుతాయి. ప్రపంచంలోని ప్రజలు వేసుకునే ప్రతి మూడు మాత్రల్లో ఒకటి మన ఇండియాలో తయారైనవే అయి ఉంటాయి. అలాగే వాక్సిన్లు కూడా ఇండియా నుంచే ప్రపంచానికి అధికంగా ఎగుమతి అవుతాయి. కానీ ఇప్పుడు చైనా లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇండియా సహా ప్రపంచమంతా ప్రత్యామ్నాయాల దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కేవలం తక్కువ ధరకే వస్తాయని ఒక దేశం పైనే అధికంగా ఆధారపడితే... ఆ దేశంలో ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కరోనా వైరస్ నిరూపించింది. అందుకే ప్రతి దేశంలో అత్యవసరాల కోసమైనా ముడిసరుకులు తయారు చేసుకునే అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. లేదంటే జ్వరమొచ్చినా... జలుబు వచ్చినా మందుల కోసం చైనా దిక్కు చూడాల్సిందే.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications