For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్చరిక: ప్రజల చేతుల్లో డబ్బులేవి, తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి భారత్

|

కరోనా మహమ్మారి కారణంగా ఇండియా మూడో క్వార్టర్‍‌లో భారతదేశం ఆర్థిక సంక్షోభంలోకి అడుగు పెట్టే ప్రమాదం ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ హెచ్చరించింది. కరోనా-లాక్ డౌన్ అనంతరం వినియోగ డిమాండ్ తక్కువగా ఉంటుందని, రికవరీకి ఎక్కువగా సమయం తీసుకుంటుందని తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీ ఎంత కాలంలో, ఎంత సమర్థవంతంగా పని చేస్తుందనే అంశంపై రికవరీ ఆధారపడి ఉంటుందని తెలిపింది.

కంపెనీ దీర్ఘకాల సుస్థిరత కోసం IBM కఠిన నిర్ణయం!కంపెనీ దీర్ఘకాల సుస్థిరత కోసం IBM కఠిన నిర్ణయం!

రూ.20 లక్షల ప్యాకేజీతో సానుకూల అంశాలు

రూ.20 లక్షల ప్యాకేజీతో సానుకూల అంశాలు

అందరి అంచనాలకు మించి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినందున, ఈ ప్యాకేజీ వల్ల ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ సాధ్యమవుతుందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ సంస్థ చీఎఫ్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ అన్నారు. ఉద్దీపన ప్యాకేజీల్లో ఎక్కువ శాతం సానుకూల ఫలితాలు ఇచ్చేవే ఉన్నాయన్నారు. అయితే ప్రజల చేతిలో నగదు లభ్యతను పెంచేవి కాకపోవడం వల్ల వస్తు సేవల డిమాండ్ ప్రస్తుతం బలహీంగా ఉంటుందని, కొంతకాలం తర్వాత బాగుండవచ్చునని అభిప్రాయపడింది.

ప్రజల చేతిలో నగదు లేకుంటే..

ప్రజల చేతిలో నగదు లేకుంటే..

ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలోప్రకటించిన చర్యలు సరఫరా మెరుగునకు ఉపయోగపడినా ప్రజల చేతిలో నగదు లేకుంటే సరుకులు, సేవలకు డిమాండ్ పెద్దగా ఉండబోదని ఈ నివేదిక తెలిపింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల ఆదాయం, ఉద్యోగాలు కోల్పోడం, వినిమయ కార్యకలాపాలు మందగించడంతో మాంద్యం ముప్పు పొంచి ఉందని తెలిపింది. మొండి బకాయిలు పెరిగే ప్రమాదముందని, బ్యాంకింగ్ రంగాన్ని ఈ పరిణామం మరింత ఒత్తిడికి గురి చేయవచ్చునని తెలిపింది.

ఆదాయాల్లో కోత.. ఉద్యోగాల కోత

ఆదాయాల్లో కోత.. ఉద్యోగాల కోత

కరోనా వల్ల అన్ని వర్గాల ఆదాయాలు పడిపోయాయని, ఉద్యోగాలు పెద్ద ఎత్తున పోతున్నాయని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తెలిపింది. వినియోగదారులు కొనుగోళ్లు, ఖర్చుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. వడ్డీరేట్ల తగ్గుదల, మారటోరియం పొడిగింపు వంటి అంశాలు కొంత ఉపశమనం కలిగించేవే అన్నారు.

English summary

హెచ్చరిక: ప్రజల చేతుల్లో డబ్బులేవి, తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి భారత్ | India likely to enter into recession in third quarter: D and B report

The Indian economy is likely to slip into recession in the third quarter of this fiscal as loss in income and jobs and cautiousness among consumers will delay recovery in consumer demand even after the pandemic, says a report.
Story first published: Monday, May 25, 2020, 11:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X