భారత్‌కు ఎబోలా వైరస్ ముప్పు? రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న ప్రాణాంతక 'ఎబోలా వైరస్' (Ebola Virus) పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ఒక సరికొత్త అడ్వైజరీ (Fresh Advisory) ని జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చిన వారు లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించి భారత్‌కు చేరుకున్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే "ఐసోలేట్" (ఒంటరిగా) అవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది.

India Issues Fresh Ebola Advisory Isolation Guidelines Symptoms Helplines

భారత్‌లో ఎబోలా కేసులు ఉన్నాయా?

దేశంలో ప్రస్తుతం ఎబోలా టెన్షన్ నడుస్తున్నప్పటికీ.. మన దేశంలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కన్ఫర్మ్డ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR Congo) నుండి గుజరాత్‌కు వచ్చిన ఒక ప్రయాణికుడికి ఎబోలా సోకినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అతనికి చేసిన పరీక్షల్లో 'నెగెటివ్' అని తేలిందని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పాన్షేరియా స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, భయాందోళనలకు గురికావద్దని ఆయన కోరారు.

ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి!

గడిచిన 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాలైన కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ప్రాంతాల్లో ప్రయాణించిన వారు కింది లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం తెలిపింది..

  • తీవ్రమైన జ్వరం (Fever)
  • తలనొప్పి , కండరాల నొప్పులు (Muscle Pain)
  • వాంతులు, విరేచనాలు
  • శరీరం నుండి ఊహించని విధంగా రక్తం కారడం (Unexplained bleeding)

పై లక్షణాలు కనిపిస్తే వెంటనే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకుని, స్థానిక ఆరోగ్య అధికారులకు సమాచారం అందించాలి. సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం 1075 అనే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

అసలు ప్రపంచంలో ఏం జరుగుతోంది?

గత నెలలో ఎబోలా వైరస్ (Ebola) తీవ్రత పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ'గా ప్రకటించింది. ఆఫ్రికా దేశాలలో ఈ వైరస్ వల్ల ఇప్పటికే 200 మందికి పైగా మరణించగా, వేల సంఖ్యలో అనుమానిత కేసులు నమోదయ్యాయి. కాంగో సరిహద్దు దేశాలకు ఈ ముప్పు ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

వైరస్ పట్ల అప్రమత్తత.. పుకార్లకు చెక్!

ఎబోలా వైరస్ (Ebola) వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రం ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల నుండి వచ్చిన వారు ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా వెంటనే 1075 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా, సమాజానికి కూడా రక్షణ కల్పించిన వారవుతారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్ముతూ, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు దూరంగా ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+