India helps Maldives: కేవలం తాను మాత్రమే కాకుండా తనను నమ్మిన వారి ఎదుగుదలకు నిరంతరం శ్రమించే వాడే నిజమైన నాయకుడు అవుతాడు. భారత్ కు ఉన్న ఈ లక్షణమే అంతర్జాతీయ విపణిలో మన దేశాన్ని ప్రపంచ పెద్దన్నగా చిత్రీకరిస్తోంది. శత్రుత్వం పెట్టుకోవాలని చూసే దేశాలకు సైతం ఆపన్న హస్తాన్ని అందిస్తూ వసుదైక కుటుంబంగా ఎదగాలని ప్రపంచానికి పిలుపునిస్తోంది.
చైనా అండ చూసుకుని భారత్‌ను దూరం పెట్టాలని మాల్టీవుల అధ్యక్షులు మయిజ్జు భావిస్తున్నారు. ఇండియా సైన్యాన్ని కూడా తమ దేశం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. ఇటీవల ఆ దేశ మంత్రులు భారత్ సహా ప్రధాని మోదీపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంత జరిగినా ఇండియా మాత్రం మాల్దీవులను క్షమించి మానవతా దృక్పథం చాటుకుంటోంది.

2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మాల్దీవులకు అవసరమైన సామాగ్రి ఎగుమతిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ దేశంలోని భారత హైకమిషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంపై వెనక్కు తగ్గేదిలేదనే సంకేతాలు బలంగా పంపించినట్లయింది.
మాల్దీవుల నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుక, కంకర వంటి సామాగ్రి ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఏకంగా 25 శాతం పెంచి లక్ష మెట్రిక్ టన్నులకు భారత్ సవరించింది. అదనంగా గుడ్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, చక్కెర, బియ్యం, గోధుమ పిండి, పప్పులు వంటి అవసరమైన ఆహార పదార్థాల ఎగుమతి పరిమితిని కూడా 5 శాతం పెంచింది. 1981లో ద్వైపాక్షిక ఒప్పందం ప్రారంభం నుంచి ఎగుమతి కోటాలో ఇదే అత్యధిక పెరుగుదల కావడం విశేషం.


Click it and Unblock the Notifications