కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ఇచ్చాయి. కరోనా అనంతరం కూడా వ్యయ నియంత్రణలో భాగంగా పలు కంపెనీలు దీనికే మొగ్గు చూపుతున్నాయి. దాదాపు సగం కంపెనీలు ఉద్యోగులతో ఇంటి నుండి పని చేయించేందుకు దీర్ఘకాల విధానాలను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే పలు ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా ఆలోచన చేసిన విషయం తెలిసిందే.

మెర్సిడెజ్ 3 రోజులు ఆఫీస్, 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్
సంప్రదాయ పని విధానంలో మార్పులు తీసుకు వచ్చేందుకు మారికో ప్రయత్నాలు చేస్తోంది. 40 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీస్ నుండి పని చేసేలా ప్లాన్ చేస్తోంది. అడ్వర్టైజింగ్ కంపెనీ వండర్‌మాన్ థాంప్సన్ 50:50 సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది. అంటే కార్యాలయంలో ఏ రోజైనా సగం మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సరికొత్త ఆలోచన చేస్తోంది. వారంలో మూడు రోజులు ఆఫీస్ నుండి పని, రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రయోజనం ఉందని, ఇది సౌకర్యవంతంగా ఉందని మెర్సిడెజ్ బెంజ్ ఎండీ అండ్ సీఈవో మార్టిన్ శ్వెంక్ చెప్పారు.

ఆఫీస్‌లో ఎన్ని గంటలు ఉన్నారని కాదు..
ఉద్యోగులు ఆఫీస్‌లో ఎన్ని గంటలు గడుపుతారనే అంశం కంటే ఔట్‌పుట్ పైన దృష్టి సారించామని, తమ ఉద్యోగులు ఇంటి నుండి వర్క్ చేసుకుంటూ మంచి పనితీరు కనబరుస్తున్నారని, ఇది తనకు ఆశ్చర్యం ఏమీ అనిపించలేదని చెబుతూ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు వండర్‌మాన్ థాంప్సన్ సౌత్ ఏసియా చైర్మన్ అండ్ గ్రూప్ సీఈవో తరుణ్ రాయ్. గతంలో కంటే ఔట్ పుట్ పెరిగిందన్నారు. కార్యాలయంలో 50 శాతం సిబ్బంది చాలునని, మిగతా వారితో ఇంటి నుండి పని చేయించవచ్చునని చెప్పారు. లాక్ డౌన్‌కు ముందు వండర్‌మాన్ థాంప్సన్ ముంబైలోని కొత్త కార్యాలయంలో ఉద్యోగుల కంటే సీట్ల సంఖ్య 20 శాతం తక్కువగా ఉన్నాయి. ఈ ఇరవై శాతం మంది ఆఫీస్ పనిమీద ప్రయాణాల్లో ఉండటం లేదా సెలవుల్లో ఉండటం వంటివి జరుగుతాయి.

ప్రయాణం తగ్గింది.. వర్క్ వేగవంతం
మారికో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ అమిత్ ప్రకాశ్ కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి అయిందని, దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు, ప్రోడక్టివిటీ బెనిఫిట్స్ ఉన్నాయన్నారు. కార్యాలయంలో 40 శాతం ఉద్యోగులతో మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 1500 మంది మారికో ఉద్యోగుల్లో 650 మంది ఆఫీస్ నుండి పని చేస్తారు. జూన్ నెలలో ఇంటి నుండి పని చేస్తామని, జూలైలో ఆఫీస్ నుండి పని చేయాలా, ఎంతమంది పని చేయాలనే అంశంపై ఆలోచిస్తామన్నారు. ఉద్యోగుల భద్రత ముఖ్యమని, దీనికి తోడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆశించిన ఫలితాలు ఇస్తోందన్నారు. ముంబైలోని తమ జూనియర్ మేనేజర్లు క్లిష్టమైన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయగలిగారని, ఎందుకంటే వారు ఇప్పుడు రెండు మూడు గంటల ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తున్నట్లు చెప్పారు.

రొటేషన్ పద్ధతిలో
KPMG ఇండియా 33 శాతం మంది ఉద్యోగుల చొప్పున రొటేషనల్ పద్ధతిలో ముందుకు సాగాలని భావిస్తోంది. ఉద్యోగులను ఇంటి నుండి లేదా ఖాతాదారుల లోకేషన్ నుండి పని చేయాలని సూచిస్తున్నామని, అనవసరమైన రాకపోకలను నివారించాలని సూచిస్తున్నట్లు కేపీఎంజీ ఇండియా పార్ట్‌నగర్ అండ్ హెడ్ ఉన్మేష్ పవార్ అన్నారు. కేపీఎంజీ ఇప్పటికే ప్లెక్సీ పాలసీలను కలిగి ఉందని, ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఇంటి నుండి పని చేయవచ్చునని తెలిపారు.

ఇది తెలివైన ఆలోచన
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ప్రయాణ ఒత్తిడి తగ్గుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో మంచి ఔట్ పుట్ కనిపిస్తోందని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ తెలివైన ఆలోచన అని మెర్సిడెజ్ బెంజ్‌కు చెందిన మార్టిన్ శ్వెంక్ చెప్పారు. ప్రయాణాన్ని తగ్గిస్తుందని, దీంతో ఉద్గారాలు తగ్గి కాలుష్యం తగ్గుతుందని, అప్ అండ్ డౌన్ ప్రయాణం తగ్గి గంటల కొద్ది సమయం ఆదా అవుతుందన్నారు.

సామాజిక దూరం కోసం 2 మీటర్ల దూరం
యాక్సిస్ గ్రూప్, మోతీలాల్ ఓస్వాల్ వంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు క్రమంగా కార్యాలయాల్లో ఉద్యోగులను పెంచుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఆఫీసుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నెస్ట్లే ఇండియా ఉద్యోగికి ఉద్యోగికి మధ్య కనీసం 2 మీటర్ల దూరం ఉండేలా డెస్క్ ఏర్పాటు చేసింది. సామాజిక దూరం కోసం అనవసరమైన చోట బెంచ్‌లు లేకుండా చేసింది. తమ ఉద్యోగులు ఎక్కువగా ఇంటి నుండి పని చేస్తున్నారని, ఆఫీస్‌కు వచ్చేవారు ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని నెస్ట్లే ఇండియా స్పోక్స్‌పర్సన్ చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications