ఢిల్లీ: భారత్‌లో మిలియన్ డాలర్ల ఆస్తి కలిగిన కుటుంబాలు 4.12 లక్షలు ఉన్నట్లు మంగళవారం విడుదలైన హూరున్ ఇండియా వెల్త్ నివేదిక 2020 వెల్లడిస్తోంది. అంటే రూ.7 కోట్లకు పైగా ఆస్తి ఉన్న కుటుంబాలు. ఈ సంపన్ను కుటుంబాల్లో 70 శాతం మంది దేశంలోని టాప్ 10 రాష్ట్రాల్లో ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది.
అలాగే, సంపన్నులు, అధిక ఆదాయం కలిగిన వారు పెట్టుబడుల కోసం షేర్లను ఎంచుకుంటున్నట్లు ఈ నివేదిక తెలిపింది. రాబోయే మూడేళ్లలో స్టాక్ మార్కెట్లో వీరి పెట్టుబడులు మరింత పెరుగుతాయని తెలిపింది. అయితే రియాల్టీలో మాత్రం పెట్టుబడులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.

మహారాష్ట్రలో అత్యధికం
మిలియన్ డాలర్ల ఆస్తి కలిగిన కుటుంబాలు అత్యధికంగా మహారాష్ట్రలో 56,000 ఉండగా, ఇందులో 16,933 కుటుంబాలు ముంబైలోనే ఉన్నాయి. ఢిల్లీలో 16,000 కుటుంబాలు, కోల్‌కతాలో 10,000 కుటుంబాలు, బెంగళూరులో 7500 కుటుంబాలు, చెన్నైలో 4700 కుటుంబాలు ఉన్నాయి. అత్యధిక మిలియనీర్ కుటుంబాలు ఉన్న ముంబై దేశ జీడీపీకి 6.16 శాతం, ఢిల్లీ 4.94 శాతం వాటాను అందిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 36వేలు, తమిళనాడులో 35వేలు, కర్నాటకలో 33వేలు గుజరాత్‌లో 29వేల మంది మిలియనీర్లు ఉన్నారు.

ఇష్టపడేవి... లగ్జరీ కార్లు, హోటల్స్
ఈ మిలియనీర్లలో అత్యధికులు లగ్జరీ కారు బ్రాండ్‌గా మెర్సిడెస్ బెంజ్ వైపు చూస్తున్నారు. ఆ తర్వాత BMW, జాగ్వర్ ఉన్నాయి. లగ్జరీ స్పోర్ట్స్ కార్లలో మిలియనీర్లు ముందుగా లంబోర్గిని వైపు చూస్తున్నారు. పోర్షే, ఆస్టన్ మార్టిన్ ఆ తర్వాత స్ధానాల్లో ఉన్నాయి. మిలియనీర్లకు ఇష్టమైన జ్యూవెలరీ బ్రాండ్‌గా తనిష్క్ ముందు నిలిచింది.
తాజ్ గ్రూప్ హోటల్స్ ఆతిథ్య విభాగంలో మిలియనీర్లు మెచ్చిన బ్రాండ్‌గా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత మారియెట్ ఉంది. మిలియనీర్లు ఎక్కువగా ఇష్టపడే మద్యం జానీవాకర్ బ్లూ లేబుల్, డామ్ పెరిగ్నన్ షాంపెయిన్, బ్యాంకులు HDFC, ICICI బ్యాంకు నిలిచాయి. బీమా రంగంలో ఎల్ఐసీ ఉంది. ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్, సింగపూర్, ఎత్తేహాద్ ఉన్నాయి. ధరించే బ్రాండ్స్ ఎక్కువగా రోలెక్స్ వాచ్.

పెట్టుబడులకు..
భారత్‌లోని అధిక సంపన్నుల్లో 26.6 శాతం మంది అమెరికాలో, 11.6 శాతం మంది సింగపూర్‌లో, పది శాతం మంది యూఏఈలో 6.6 శాతం మంది యూకేలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం చాలామంది తమ పిల్లలను అమెరికా, యూకే, కెనడా పంపిస్తున్నారు. చాలామంది మిలియనీర్లు ఎల్ఐసీనే నమ్ముతున్నారు. దాదాపు 39 శాతం మంది ఎల్ఐసీలో, 17 శాతం మంది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో, 13.6 శాతం మంది ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌లో బీమా తీసుకున్నారు.

కొత్త మధ్య తరగతి.. రూ.20 లక్షల పొదుపు
దేశంలో 5.64 కోట్ల మిడిల్ క్లాస్ కుటుంబాలు ఉన్నాయి. రూ.7 కోట్ల కంటే తక్కువ ఆస్తి కలిగి ఉండి, ప్రతి సంవత్సరం రూ.2.5 లక్షలకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న వారిని హూరున్ ఈ జాబితాలో చేర్చింది. హూరున్ దేశంలో సరికొత్త మధ్య తరగతి వర్గాన్ని గుర్తించింది. ప్రతి సంవత్సరం రూ.20 లక్షలు పొదుపు చేస్తున్న 6.33 లక్షల కుటుంబాలను ఈ కేటగిరీలో చేర్చింది. వీరు నివాస గృహాలు, వాహనాలు వంటి స్థిర, చరాస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపింది.

ఏపీ, తెలంగాణల్లో మిలియనీర్ కుటుంబాలు
దేశంలో మిలియనీర్ లేదా దాదాపు రూ.7.3 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన కుటుంబాలు 4.12 లక్షలు ఉండగా, ఇందులో ఏపీలో 20వేలు, తెలంగాణలో 18వేల కుటుంబాలు ఉన్నాయి. వేగంగా సంపద సృష్టిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి అని హూరున్ నివేదిక తెలిపింది. ఏటా బిలియనీర్ల సంఖ్యను జత చేయడంలో భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో రూ.7.3 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన కుటుంబాలు 20,000 ఉండగా, తెలంగాణలో 18,000 కుటుంబాలు ఉన్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications