ఈ విషయంలో అమెరికా, చైనా చేయని పనిని భారత్ చేసింది.. టన్నుల కొద్దీ బంగారం..!!
బంగారం అనేది ప్రజలకే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా సురక్షితమైన పెట్టుబడి. అదే విధంగా దేశ కరెన్సీ విలువ, ద్రవ్యోల్బణం, ద్రవ్య ప్రవాహం మొదలైన చాలా అంశాలను నియంత్రించడంలో బంగారం ఒక ముఖ్యమైన ఆయుధంగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా బంగారం ధర పెద్ద ఎత్తున పెరుగుతు వస్తుంది, దింతో ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంకులు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో భారత్ ముందంజలో ఉంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) పబ్లిష్ చేసిన సమాచారం ప్రకారం అక్టోబర్ 2024లోనే ప్రపంచంలోని రిజర్వ్ బ్యాంకులు 60 టన్నులకు పైగా బంగారాన్ని కొన్నాయి. డబ్ల్యుజిసి ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే 27 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి నుండి అక్టోబర్ 2024 వరకు మొత్తం 77 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2023తో పోలిస్తే ఈ మొత్తం ఐదు రెట్లు ఎక్కువ. దీంతో భారత్‌లో బంగారం నిల్వ 882 టన్నులకు చేరుకుంది. భారతదేశం మొత్తం బంగారు నిల్వలలో 510 టన్నుల కంటే ఎక్కువ బంగారం ఇండియాలో ఉండగా మిగిలినది లండన్ రిజర్వ్ బ్యాంకులో ఉంది.

భారతదేశంలాగానే టర్కీ రిజర్వ్ బ్యాంక్ జనవరి-అక్టోబర్ కాలంలో 72 టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది. పోలాండ్ రిజర్వ్ బ్యాంక్ 69 టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచ రిజర్వ్ బ్యాంకుల మొత్తం బంగారం కొనుగోళ్లలో ఈ మూడు దేశాలు మాత్రమే 60% వాటాతో ఉన్నాయి. టర్కీ రిజర్వ్ బ్యాంక్ వరుసగా 17 నెలలుగా బంగారాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. పోలాండ్ రిజర్వ్ బ్యాంక్ కూడా వరుసగా 7 నెలలు బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. చెక్ రిపబ్లిక్ రిజర్వ్ బ్యాంక్ కూడా వరుసగా 20 నెలలుగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. అక్టోబర్‌లో కిర్గిస్థాన్ కూడా 2 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 2023 తర్వాత ఇది అత్యధిక ప్రతినెల కొనుగోలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఘనా కూడా అక్టోబర్‌లో 1 టన్ను కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో ఘనా బంగారం నిల్వలు 28 టన్నులకు పెరిగాయి.


Click it and Unblock the Notifications