అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా భారత్‌పై 50 శాతం అదనపు టారిఫ్‌లు విధించడంపై పలు దేశాలు భగ్గుమంటున్నాయి. తొలుత 25 శాతానికే పరిమితం అవుతారని అనుకున్నా.. మరికొన్ని రోజులు గడవకముందే మరో 25 శాతం సుంకాలు విధిస్తూ.. మొత్తం 50 శాతం భారాన్ని ఇండియా మీద మోపారు.అంతే కాకుండా రష్యాతో క్రూడాయిల్ కొనుగోలు ఆపకపోతే మరో విడత టారిఫ్ పెంపులు, ద్వితీయ ఆంక్షల అమలు చేస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆంక్షలు ఈ నెల 25వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ ఈ నెల 29 నుంచే అమల్లోకి వస్తుంది. అంటే అమెరికా వాణిజ్య విధానాలకు ప్రతిస్పందనగా భారత్ తీసుకున్న చర్యగా దీనిని విశ్లేషిస్తున్నారు.
అమెరికా అమలు చేస్తున్న ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ (IEEPA) టారిఫ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, అంతర్జాతీయ పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా రవాణా చేసే సరుకులన్నింటిపైనా కస్టమ్స్ సుంకాలు వసూలు చేయాలని ఆదేశించారు. వాటి విలువ ఎంతైనా సంబంధం లేకుండా ఈ నియమం వర్తిస్తుంది. అయితే 100 డాలర్ల లోపు విలువ కలిగిన బహుమతులకు మాత్రం మినహాయింపు ఇవ్వబడింది.

డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఆమోదం పొందిన థర్డ్ పార్టీ సంస్థలు లేదా పోస్టల్ క్యారియర్లు ఈ టారిఫ్‌ను వసూలు చేసి అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే టారిఫ్ వసూళ్లు, చెల్లింపు విధానాలకు సంబంధించిన స్పష్టత లేకపోవడంతో, ఎయిర్ క్యారియర్లు ఈ నెల 25వ తేదీ నుంచే అమెరికాకు వెళ్లే పోస్టల్ పార్సిళ్లను స్వీకరించలేమని ప్రకటించాయి.
దీని ప్రభావం భారత్ పోస్టల్ శాఖపై పడింది. ఫలితంగా పోస్టల్ విభాగం కూడా ఈ నెల 25వ తేదీ నుండి అమెరికాకు వెళ్లే అన్ని రకాల Postal Services బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఉత్తరాలు, డాక్యుమెంట్లు, అలాగే 100 అమెరికన్ డాలర్ల వరకు విలువ కలిగిన బహుమతులపై ఈ నిషేధం వర్తించదు. వీటికి మినహాయింపులు కొనసాగుతాయి.
అమెరికాకు పంపే ఇతర రకాల పోస్టల్ ఆర్టికల్స్ ఇప్పటికే బుక్ చేసుకున్న వినియోగదారులు పోస్టల్ ఛార్జీలను వాపసు పొందవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అదేవిధంగా, వీలైనంత త్వరగా అమెరికాకు పూర్తి స్థాయి పోస్టల్ సేవలను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని హామీ ఇచ్చింది.
More From GoodReturns

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications