2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జీడీపీ) వృద్ధి రేటును ఆర్బీఐ విడుదల చేయనుంది. మూడు నెలల క్రితం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కనిపించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు త్వరగా పుంజుకోవడంతో వృద్ధి రేటు అంచనాలు సానుకూలంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది (2020) మార్చిలో ప్రారంభమైన కరోనా ప్రభావం ఆ తర్వాత నాలుగు నెలల పాటు తీవ్రంగా పడింది. జూలై నుండి క్రమంగా కోలుకున్నప్పటికీ, సెకండ్ వేవ్ ఇటీవల మళ్లీ ఆందోళన రేకెత్తించింది. ఈ ప్రభావం జీడీపీ వృద్ధి రేటు పైన ఉంటుంది.
రాష్ట్రాల మొత్తం ద్రవ్యలోటు స్థూల జాతియోత్పత్తిలో (జీడీపీ) 4.1 శాతానికి మించగలదాని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) అంచనా వేసింది. FY22లో ఈ ఏజెన్సీ అంతకుముందు 4.3 శాతం అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం FY22లో నామినల్ జీడీపీ వృద్ధి రేటు 15.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. FY22కి గాను ఈ ఏజెన్సీ ఫిబ్రవరిలో అంచనా వేసిన 14.2 శాతం కంటే ఇది ఎక్కువ.
6.8 శాతం లోటు లక్ష్యం నెరవేరే అవకాశముందని భావిస్తున్నామని, ప్రభుత్వం దీనిని మరింత మెరుగుపరుస్తుందనుకుంటున్నామని, అయితే ఆర్థిక కార్యకలాపాల మద్దతు కోసం అదనపు రెవెన్యూ ఖర్చు చేయరని భావిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. FY22లో భారత జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా ఉండవచ్చునని సీఈఏ కెవీ సుబ్రమణియన్ అన్నారు. భారత వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో బలంగా ఉన్నంత మాత్రాన బలమైన రికవరీగా భావించడం సరికాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

CMIE సర్వే ప్రకారం భారత్‌లో ఉద్యోగిత రేటు జూన్ 2వ వారం నుండి మెరుగుపడుతోంది. నిరుద్యోగిత రేటు జూన్ నెలలో 9.17 శాతంగా ఉంది. మే నెల 11.9తో పోలిస్తే ఇది చాలా మెరుగు. అప్పుడు ఇది పన్నెండు నెలల గరిష్టం. FDI ఇన్‌ఫ్లోలో బారత్ టాప్ 10 దేశాల్లో ఉంది. ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది. UNCTAD వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్ 2021 (WIR) ప్రకారం భారత్ 2020లో ఐదో స్థానంలో నిలిచింది. గ్రాస్ FDI ఇన్-ఫ్లో జనవరి నుండి మే మధ్య కాలంలో 32 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020 మొత్తంలో వచ్చిన ఇన్-ఫ్లోలో ఇది 37 శాతం వాటా కావడం గమనార్హం.
భారత్‌లోకి ఇటీవల FPIలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తద్వారా ప్రపంచ మేజర్ ఎమర్జింగ్ మార్కెట్‌లో ఒకటిగా నిలుస్తోంది. ప్రపంచంలోనే చైనా, బ్రెజిల్ తర్వాత భారత్ డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్ అత్యంత వేగంగా, ఒక ఏడాదిలో భారీగా వృద్ధి సాధించడం గమనార్హం. చైనా మార్కెట్లు ఏడాదిలో 35 శాతం, బ్రెజిల్ 9 శాతం, ఇండియా 8 శాతం, ఇండోనేషియా 1 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక థాయ్‌లాండ్ మార్కెట్లు 3 శాతం, సౌతాఫ్రికా మార్కెట్ 1 శాతం, పిలిప్పీన్స్ 2 శాతం, టర్కీ 1 శాతం, సౌత్ కొరియా 18 శాతం నష్టపోయాయి.
FY22 మొదటి త్రైమాసికానికిగాను ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాలను గతంలో 26.2 శాతం అంచనా వేగా, ఇప్పుడు 21.4 శాతానికి సవరించింది. రూటర్స్ పోల్‌లో 40 మంది ఆర్థికవేత్తలు 20 శాతం అంచనా వేశారు. ఫిచ్ ఇండియా వింగ్ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ భారత వృద్ధి రేటు అంచనాలను 9.4 శాతంగా అంచనా వేసింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications