2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్(GDP) వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయినట్లు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్(MoSPI) మంగళవారం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (FY21) ఇదే మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 24.4 శాతం కాగా, ఇప్పుడు 20.1 శాతం సానుకూలంగా నమోదయింది. మొదటి త్రైమాసికంలో స్థిరమైన ధరల వద్ద(2011-12) భారత జీడీపీ రూ.32.38 లక్షల కోట్లుగా ఉంది. అయితే మొదటి త్రైమాసికంలో 2019-20 మొదటి త్రైమాసికంలో చూసిన రూ.35.66 లక్షల కోట్ల కంటే ఇది తక్కువగా ఉంది. భారత్ కరోనా నుండి బయటపడలేదని ఇది సూచిస్తోంది.
నిర్మాణ రంగ జీవీఏ గత సంవత్సరం కంటే 68.9 శాతం ఎక్కువ. సేవల రంగం గత ఏడాది కంటే 3.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 1.6 శాతం వృద్ధి చెందింది. 2020.21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి భారత దేశ జీడీపీ 7.3 శాతానికి కుదించింది.

CMIE సర్వే ప్రకారం భారత్‌లో ఉద్యోగిత రేటు జూన్ 2వ వారం నుండి మెరుగుపడుతోంది. నిరుద్యోగిత రేటు జూన్ నెలలో 9.17 శాతంగా ఉంది. మే నెల 11.9తో పోలిస్తే ఇది చాలా మెరుగు. అప్పుడు ఇది పన్నెండు నెలల గరిష్టం. FDI ఇన్‌ఫ్లోలో భారత్ టాప్ 10 దేశాల్లో ఉంది. ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది. UNCTAD వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్ 2021 (WIR) ప్రకారం భారత్ 2020లో ఐదో స్థానంలో నిలిచింది. గ్రాస్ FDI ఇన్-ఫ్లో జనవరి నుండి మే మధ్య కాలంలో 32 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020 మొత్తంలో వచ్చిన ఇన్-ఫ్లోలో ఇది 37 శాతం వాటా కావడం గమనార్హం.
భారత్‌లోకి ఇటీవల FPIలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తద్వారా ప్రపంచ మేజర్ ఎమర్జింగ్ మార్కెట్‌లో ఒకటిగా నిలుస్తోంది. ప్రపంచంలోనే చైనా, బ్రెజిల్ తర్వాత భారత్ డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్ అత్యంత వేగంగా, ఒక ఏడాదిలో భారీగా వృద్ధి సాధించడం గమనార్హం. చైనా మార్కెట్లు ఏడాదిలో 35 శాతం, బ్రెజిల్ 9 శాతం, ఇండియా 8 శాతం, ఇండోనేషియా 1 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక థాయ్‌లాండ్ మార్కెట్లు 3 శాతం, సౌతాఫ్రికా మార్కెట్ 1 శాతం, పిలిప్పీన్స్ 2 శాతం, టర్కీ 1 శాతం, సౌత్ కొరియా 18 శాతం నష్టపోయాయి.
FY22 మొదటి త్రైమాసికానికిగాను ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాలను గతంలో 26.2 శాతం అంచనా వేగా, ఇప్పుడు 21.4 శాతానికి సవరించింది. రూటర్స్ పోల్‌లో 40 మంది ఆర్థికవేత్తలు 20 శాతం అంచనా వేశారు. ఫిచ్ ఇండియా వింగ్ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ భారత వృద్ధి రేటు అంచనాలను 9.4 శాతంగా అంచనా వేసింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications