ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ సంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA) దక్షిణాసియా రాజకీయల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆసియా దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఈ ఒప్పందంపై తీవ్ర ఆగ్రహాంతో రగిలిపోతున్నాయి. తమకు వ్యతిరేకంగా పనిచేసే ఒక ఆర్థిక సవాల్ గా దీనిని చూస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ (EU) మార్కెట్‌లో ఇప్పటివరకు ఈ రెండు దేశాలు అనుభవిస్తున్న ప్రత్యేక వాణిజ్య ప్రయోజనాలకు భారత్ గట్టి పోటీగా మారింది.
గత దశాబ్దకాలంగా పాకిస్థాన్‌కు GSP+ (Generalised System of Preferences Plus) హోదా ఉండటంతో.. బంగ్లాదేశ్‌కు LDC (Least Developed Country) దేశంగా గుర్తింపు ఉండటంతో, ఈ రెండు దేశాలు యూరప్‌కు తమ వస్త్రాలు, దుస్తులు, లెదర్ ఉత్పత్తులు వంటి వాటిని సుంకాలు లేకుండా (డ్యూటీ ఫ్రీగా) ఎగుమతి చేస్తున్నాయి. అదే సమయంలో భారత్ నుంచి EUకి వెళ్లే వస్తువులపై 10 నుంచి 12 శాతం వరకు సుంకం ఉండేది. దీంతో ధరల పరంగా భారత్ వెనుకబడిన పరిస్థితి కనిపించేది.

తాజాగా భారత్-EU FTA ఒప్పందంతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే, భారత్‌కూ యూరోప్ మార్కెట్‌లో జీరో డ్యూటీ యాక్సెస్ లభిస్తుంది. దీని ఫలితంగా భారతీయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యం, సరఫరా గొలుసు బలంగా ఉన్న భారత్ వైపు యూరోపియన్ దిగుమతిదారులు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడుతోంది.
ఇది పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు పెద్ద ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా వస్త్ర రంగం (Textiles & Garments)పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి యూరప్‌కు జరిగే సుమారు 9 బిలియన్ డాలర్ల (రూ. 75 వేల కోట్లకు పైగా) ఎగుమతులు ప్రమాదంలో పడవచ్చని అక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్‌కు ఇది మరో దెబ్బగా మారనుంది.
పాక్ ట్రేడర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. భారత్ ఇప్పుడు మాపై ఆర్థిక యుద్ధం ప్రకటించినట్లేనంటూ అక్కడి వ్యాపార వర్గాలు వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గతంలో భద్రతా, దౌత్య రంగాల్లో ఎదురైన సవాళ్ల తర్వాత, ఇప్పుడు వాణిజ్య రంగంలోనూ భారత్ ముందంజ వేస్తోందనే భావన పాకిస్థాన్‌లో బలపడుతోంది.
అటు బంగ్లాదేశ్ కూడా క్లిష్ట పరిస్థితిలో ఉంది. త్వరలో LDC హోదా నుంచి బయటపడనున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఉన్న డ్యూటీ ఫ్రీ ప్రయోజనాలు తగ్గే ప్రమాదం ఉంది. భారత్‌కు EU మార్కెట్‌లో సమాన హక్కులు లభిస్తే.. యూరోపియన్ బ్రాండ్లు భారత్ వైపు మళ్లే అవకాశం ఉందని బంగ్లాదేశ్ భయపడుతోంది. అందుకే యూరోపియన్ యూనియన్‌తో అత్యవసర చర్చలు జరపడానికి ఢాకా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే కేంద్ర బడ్జెట్ 2026-27లో విదేశీ సాయం కింద బంగ్లాదేశ్‌కు కేటాయించే నిధులను సగానికి తగ్గిస్తూ మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.60 కోట్లకు పరిమితం చేసింది. దీంతో పాటుగా భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్‌లోని చాబహార్ పోర్టు ప్రాజెక్ట్‌కు ఈ ఏడాది బడ్జెట్‌లో ఎలాంటి నిధుల కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలుగా చాబహార్ పోర్టు భారత్‌కు మధ్య ఆసియా, అఫ్గానిస్థాన్ ప్రాంతాలతో వాణిజ్య, వ్యూహాత్మక అనుసంధానానికి కీలకంగా పరిగణించబడుతున్నప్పటికీ, ఈసారి బడ్జెట్‌లో దానికి ప్రాధాన్యం దక్కలేదు.
న్యూఢిల్లీ-ఢాకా మధ్య సంబంధాలు గత కొంతకాలంగా అస్థిర పరిస్థితుల్లో ఉన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారత్ ఆందోళనను పెడచెవినపెడుతూ వస్తోంది. హిందువులు సహా మైనారిటీలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిని బంగ్లాదేశ్ పట్టించుకోకపొవడంతో విదేశీ సాయం కేటాయింపుల్లో కోత విధించడం ద్వారా భారత్ అసంతృప్తిని వ్యక్తం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు
ఇదే సమయంలో ఈ బడ్జెట్‌లో భూటాన్‌కు అత్యధికంగా రూ.2,288 కోట్ల ఆర్థిక సాయం కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు ఆరు శాతం పెరుగుదల కావడం విశేషం. అలాగే నేపాల్‌కు రూ.800 కోట్లు, శ్రీలంకకురూ.400 కోట్లు, మయన్మార్‌కు రూ.300 కోట్లు కేటాయించారు. మాల్దీవులు, మారిషస్‌కు చెరో రూ.550 కోట్లు, అఫ్గానిస్థాన్‌కు రూ.150 కోట్లు, మంగోలియాకు రూ.25 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆఫ్రికన్ దేశాలకు రూ.225 కోట్లు, సీషెల్స్‌కు రూ.19 కోట్ల విదేశీ సాయంను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపరిచింది.
More From GoodReturns

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications