Direct Taxes: గతంతో పోలిస్తే దేశంలో పన్ను వసూళ్లు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అంచనాలను సైతం తలక్రిందులు చేస్తూ దూసుకుపోతున్నాయి. తాజాగా విడుదలైన ప్రత్యక్ష పన్నల వసూళ్ల డేటాలోనూ డబుల్ డిజిట్ మేర వృద్ధి కనిపించింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు రాబట్టిన ప్రత్యక్ష పన్ను వసూళ్ల డేటా విడుదలైంది. భారతదేశ నికర డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు 15.87 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. తద్వారా మొత్తం 4.75 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలిక గణాంకాలను వెల్లడించింది.

ఆదాయం మరియు కార్పొరేట్ పన్నులతో సహా స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 5.17 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 14.65 శాతం పెరిగాయి. అంటే బడ్జెట్ అంచనాలలో 26.05 శాతానికి ఎగసి 18.23 లక్షల కోట్లను తాకినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మరోపక్క ఏప్రిల్-జూలై 9, 2023 మధ్య కాలంలో 42 వేల కోట్ల రీఫండ్స్ జారీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే గతేడాది ఇదే సమయంలో ఇచ్చిన రీఫండ్‌ల కంటే ఇది 2.55 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 2023-24 బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 18.23 లక్షల కోట్లకు పైగా ఉండవచ్చని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇది గతేడాది రాబట్టిన 16.61 లక్షల కోట్ల కంటే 9.75 శాతం ఎక్కువ.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications