కరోనా వైరస్ దెబ్బకు కుదేలైన చిన్న పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. కోట్ల మందికి ఉపాధి కల్పించే ఈ రంగం... ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా ఇండియన్ ఎకానమీ కూడా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకే, ఈ రంగానికి పెద్ద మొత్తంలో ఒక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని సంకల్పిస్తున్నట్లు తెలిసింది. చిన్న తరహా కంపెనీలు తీసుకునే అదనపు రుణాలకు ఇకపై ప్రభుత్వమే గారంటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి.
ఇదే జరిగితే గనుక బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎలాంటి భయాలు లేకుండా చిన్న సంస్థలకు రుణాలను మంజూరు చేస్తాయి. తద్వారా కంపెనీలకు నగదు లభ్యత పెరిగి వ్యాపారం కొనసాగించేందుకు, మళ్ళీ పునర్వైభవం సాధించేందుకు అవకాశం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇండియాలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందే రంగం ఎంఎస్ఎంఈ నే కావటం విశేషం. అందుకే దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

జంబో ప్యాకేజీ ....
దేశంలోని లక్షలాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సంస్థలకు కేంద్రం భారీ ఊరట కల్పించబోతోంది. ఈ పరిశ్రమను ఆదుకునేందుకు ఏకంగా రూ 3 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ప్యాకేజీ ని ప్రకటించబోతోంది. ఈ విషయాన్నీ ప్రముఖ వార్తా ఏజెన్సీ బ్లూమ్బెర్గ్ ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది. ఈ ప్యాకేజీ లో భాగంగా దేశంలోని ఎంఎస్ఎంఈ లు అదనంగా 20% రుణాలు పొందే వీలు ఉంటుంది.
ఈ రుణాలకు కేంద్ర ప్రభుత్వమే గారంటీ ఇస్తుంది. దాంతో, దాదాపు అన్ని సంస్థలకు నేరుగా 20% అదనపు ఋణం లభించి వర్కింగ్ కాపిటల్ నిధుల ప్రవాహం పెరుగుతుంది. ఒక వేళ ఏదేని బలమైన కారణం చేత ఋణం తీసుకున్న సంస్థ డిఫాల్ట్ అయితే, అలాంటి రుణాలను బ్యాంకులకు నేరుగా చెల్లించేందుకు ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని బ్లూమ్బెర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. దేశంలో 40 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతుండటంతో చిన్న సంస్థలకు పెద్ద కష్టమొచ్చి పడింది. ప్రభుత్వ చేయూత లేకుండా ఈ సంస్థలు మనగలగటం అసాధ్యం.

90% మందికి ఉపాధి...
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అంత భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేంది ఎంఎస్ఎంఈ లే. దేశంలో అందుబాటులో ఉన్న శ్రామిక శక్తి లో దాదాపు 90% మందికి ఉపాధి ఈ రంగంలోనే దొరుకుతోంది. అధికారిక అంచనా ప్రకారం... సుమారు 10 కోట్లకు పైగా మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఒకవేల ఈ రంగం పనితీరు నెమ్మదిస్తే... వెంటనే ఉద్యోగాలకు ఎసరు వస్తుంది. దాంతో దేశంలో ఇప్పటికే పెరిగిపోతున్న నిరుద్యోగం మరింతగా పెచ్చరిల్లుతుంది.
ప్రస్తుతం దేశంలో 4 దశాబ్దాల గరిష్ట స్థాయిలో నిరుద్యోగం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సుమారు 2.5 కోట్ల మంది పనిచేయగలిగే వయసులో ఉన్న వారు ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నారని, తద్వారా ఎంతో విలువైన శ్రామిక శక్తి వృధా అవుతోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, అత్యధిక మందికి ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా కంపెనీలను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత కేంద్రానిదే అని వారు సూచిస్తున్నారు.

6.5 కోట్ల కంపెనీలు...
దేశంలో అధికారికంగా సుమారు 6.5 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎంఎస్ఎంఈ) తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో వీటిదే ప్రధాన భాగస్వామ్యం. ఒక్క ఉపాధిలోనే కాకుండా.. మొత్తం దేశ ఎగుమతుల్లో 45% వాటా కలిగి పెద్ద ఎత్తున దేశానికి విదేశి మారక ద్రవ్యాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 3 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) లో ఈ రంగానికి 30% వాటా ఉంది.
దీనిని త్వరలోనే 50% నికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే అందులో ఎంఎస్ఎంఈ లు ప్రధాన భూమిక పోషించాల్సిందే. అందుకే, ప్రస్తుత విపత్కర పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రూ 3 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇది ప్రకటనలకే పరిమితం కాకుండా, పకడ్బందీగా అమలు చేస్తేనే ఆశించిన ప్రయోజనం దక్కుతుందని చెబుతున్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications