కరోనా వైరస్ పుణ్యమా అని చాలా మంది వర్క్ ఫ్రొం హోమ్ పద్ధతిలో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే ఇంటి నుంచి పని చేసేందుకు కావాల్సిన కంప్యూటర్లు, లాప్టాప్ లకు కూడా గిరాకీ భారీగా ఉంటోంది. కానీ ఇంటర్నెట్ సేవల్లో వేగం మరింతగా పెరగటం లేదు. అదే సమయంలో బ్రాడ్ బ్యాండ్ సేవలు ఖరీదుగా మారిపోయాయి.
ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ ను తట్టుకునేందుకు ఈ రంగంలో ఉన్న కంపెనీలు ధరలు పెంచటంతో పాటు, అడ్వాన్స్ రూపంలో ప్రజల నుంచి ముందస్తుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే, ఈ కష్టాలు త్వరలోనే ముగిసిపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. గృహాలకు అందించే బ్రాడ్ బ్యాండ్ సేవలపై ప్రభుత్వం విధించే చార్జీలను దాదాపు పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచన చేస్తోందట మన కేంద్ర ప్రభుత్వం.
ఇందుకోసం గృహాలకు అందించే ఫిక్స్డ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై విధించే అడ్జస్టడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) లైసెన్స్ ఫీజు ను తగ్గించాలని కృత నిశ్చయంతో ఉందని సమాచారం. అదే జరిగితే దేశంలో బ్రాడ్ బ్యాండ్ సేవల ధరలు తగ్గి, అందరికీ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

లైసెన్స్ చార్జీ ఒక్క రూపాయే...
ప్రస్తుతం ఇంటర్నెట్, టెలికాం సేవలు అందించే కంపెనీల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏజీఆర్ వసూలు చేస్తోంది. దానిపై లైసెన్సు ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఏటా భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. కానీ, త్వరలోనే గృహాలకు అందించే ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు మాత్రం ఈ చార్జీలను ఏడాదికి రూ 1 మాత్రమే వసూలు చేయాలని ప్రతిపాదిస్తోందంట.
దీంతో, టెలికాం కంపెనీల పై న చార్జీల భారం తగ్గుతుంది కాబట్టి, అవి గృహాలకు అందించే ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటు ధరల్లో ప్రజలకు చేరువ చేస్తాయని భావిస్తున్నారు. దీంతో అటు ధరల్లో తరుగుదల, ఇటు ఇంటర్నెట్ వేగం కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏజీఆర్ పైన లైసెన్స్ ఫీజు 8% ఉంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత శాఖల అభిప్రాయాలు తెలపాలని కోరినట్లు సమాచారం.

రిలయన్స్ జియో కు లాభం...
ఆలస్యంగా టెలికాం సేవల్లోకి ప్రవేశించినా... వస్తూ వస్తూనే సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో... కు ప్రస్తుత ప్రతిపాదనతో భారీగా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే రిలయన్స్ ఫైబర్ నెట్ అనే పేరుతో ఫిక్స్డ్ ఇంటర్నెట్ సేవలతో పాటు అనేక బండిల్ ఆఫర్లను కస్టమర్ల అందిస్తోంది. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న ఈ సేవలను విస్తృతం చేసేందుకు ఆ కంపెనీకి మార్గం సుగమం అవుతుంది. ఇంటర్నెట్ తో పాటు, టీవీ ఛానెల్స్, లైవ్ స్ట్రీమింగ్ వంటి అనేక సదుపాయాలు ఇందులో మిళితమై ఉన్నాయి.
లైసెన్స్ ఫీజు తగ్గిస్తే ఆ మేరకు సేవల పై ఖర్చులు తగ్గి కంపెనీకి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు ఈ రంగంలో సేవలు అందిస్తున్న ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా తో పాటు మరో 350 కంపెనీలకు కూడా భారీగా లబ్ధి చేకూరుతుంది. ఇదిలా ఉండగా... ఏజీఆర్ పై లైసెన్స్ ఫీజు తగ్గింపు కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ సేవలు, పెద్ద కంపెనీలకు అందించే బ్రాడ్ బ్యాండ్ సేవలపై ప్రస్తుత లైసెన్స్ ఫీజులే కొనసాగనున్నాయి.

అందుకే తగ్గింపు...
వాస్తవానికి ఏజీఆర్ లైసెన్సు ఫీజులు తగ్గిస్తే ప్రభుత్వానికి లభించే ఆదాయానికి గండి పడుతుంది. ఇది సుమారు రూ 5,900 కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రతి సంవత్సరం దీనిపై 10% వృద్ధి ని కూడా ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుంది. కానీ, ఇండ్లకు బ్రాడ్ బ్యాండ్ సేవల విస్తృతి పెరిగితే లభించే ప్రయోజనం ముందు ఇది తగ్గువగానే ఉంటుందని అంచనా. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 2019 నివేదిక ప్రకారం... ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ సేవల విస్తృతి 10% పెరిగితే జీడీపీ పర్ క్యాపిట 1.9% మేర వృద్ధి చెందుతుంది. కాబట్టి, స్థూలంగా ఈ నిర్ణయం అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఉభయతారకంగా ఉంటుందని భావిస్తున్నారు. టెలికాం రేగులేటరీ అథారిటీ (ట్రాయ్ ) గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 66 కోట్ల మంది ఇంటర్నెట్ సేవలు వినియోగిస్తున్నారు.
కానీ అందులో 64 కోట్ల మంది మొబైల్ ఆధారిత ఇంటర్నెట్ వాడుతున్నవారే కావటం గమనార్హం. ఫిక్స్డ్ లైన్ ఆధారిత ఇంటర్నెట్ వినియోగదారులు కేవలం 2.2 కోట్లు మాత్రమే. కాబట్టి, దేశంలో ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ విస్తృతి పెంచాలని లైసెన్సు ఫీజులు తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తున్నట్లు స్పష్టమవుతోంది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..



Click it and Unblock the Notifications