India-US trade deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో.. భారతదేశంతో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన అనంతరం, భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేసిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై తాజాగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి స్పందించారు. భారతదేశ ఇంధన విధానం పూర్తిగా జాతీయ ప్రయోజనాల ఆధారంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నిర్వహించిన ప్రత్యేక మీడియా బ్రీఫింగ్‌లో మాట్లాడిన మిస్రి.. చమురు, ఇంధన రంగంలో తీసుకునే నిర్ణయాలు రాజకీయ ఒత్తిళ్ల వల్ల కాకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులు దేశ అవసరాల ఆధారంగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం అయినా, ప్రైవేట్ సంస్థలైనా.. అందరూ జాతీయ ప్రయోజనాలే దిశానిర్దేశం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా రష్యా నుంచి చమురు దిగుమతుల విషయానికి వస్తే.. ఇది ప్రభుత్వ ఆదేశాల ద్వారా కాకుండా, చమురు కంపెనీలు తీసుకునే వ్యాపార నిర్ణయమని మిస్రి వివరించారు. ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు లభ్యత, ధరలు, సరఫరా భద్రత, ప్రమాద అంచనా, లాజిస్టిక్స్ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. ఆయిల్ మార్కెట్ చాలా క్లిష్టమైనదని, ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ వనరుల నుంచి సరఫరా పొందడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశం చమురు, గ్యాస్ రంగంలో నికర దిగుమతిదారైన దేశం అని గుర్తుచేసిన మిస్రి.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాన్ని గమనిస్తూ ముందుకెళ్తుందని చెప్పారు. అందుకే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే విధంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ రంగంలో మీరు చూస్తున్నది పూర్తిగా వ్యాపారపరమైన ఎంపికలే. అవి ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు లేదా వ్యాపార సంస్థల నిర్ణయాలు కావచ్చు. కానీ అవన్నీ జాతీయ ప్రయోజనాల చుట్టూనే తిరుగుతాయని మిస్రి వ్యాఖ్యానించారు. భారత్‌కు ఇంధన భద్రత అత్యంత కీలకమని.. సరసమైన ధరల్లో నిరంతర సరఫరా ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. దానితో పాటు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాల్సిన అవసరం లేదని, అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంధన విధానంపై తుది నిర్ణయం ఎప్పుడూ మార్కెట్ పరిస్థితులు, దేశ అవసరాల ఆధారంగానే ఉంటుందని మళ్లీ మళ్లీ నొక్కిచెప్పారు.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications