భారత వస్తువులకు చైనా తలుపులు తెరవడం లేదు..దశాబ్ద కాలం నుంచి అడుగుతున్నా వినడం లేదంటున్న నిర్మలా సీతారామన్..

India-China Trade: అంతర్జాతీయ విపణిలో భారతీయ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ.. చైనా విధిస్తున్న పారదర్శకత లేని సుంకేతర అడ్డంకులే మన ఎగుమతులకు ప్రధాన అవరోధంగా మారాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా అట్లాంటిక్ కౌన్సిల్ నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆమె ప్రసంగించారు. జెనరిక్ మందులు, పశు మాంసం, వ్యవసాయ ఉత్పత్తులతో సహా పలు రంగాలలో భారత్ అగ్రగామిగా ఉన్నప్పటికీ.. పారిశుధ్య, వృక్ష ఆరోగ్య నిబంధనలు, కఠినమైన నియంత్రణల పేరుతో చైనా.. భారత ఉత్పత్తులను తన మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటోందని ఆర్థికమంత్రి ఆరోపించారు.

భారత వ్యాపారులకు చైనా మార్కెట్లో సమాన అవకాశాలు కల్పించాలని గత దశాబ్ద కాలంగా నిరంతరం కోరుతున్నప్పటికీ.. చైనా వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని మంత్రి నిర్మలమ్మ వెల్లడించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారతదేశ వాణిజ్య లోటు 52.7 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2025-26 నాటికి అది ఏకంగా 112 బిలియన్ డాలర్లకు చేరి రెట్టింపు కంటే ఎక్కువైంది.

Nirmala Sitharaman China non-tariff barriers India China trade Indian exports to China India China trade deficit China trade restrictions market access for Indian goods generic drugs exports agricultural exports India India trade news non-tariff trade barriers Finance Minister news October 2026 trade news

చైనా అనుసరిస్తున్న ఈ మొండి వైఖరిపై ఇతర దేశాల వలె భారత్ వెంటనే ప్రతీకార సుంకాలు విధించకుండా.. సమస్యల పరిష్కారం కోసం దౌత్యపరమైన చర్చలకే భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతకుముందు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. చైనాతో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ వాణిజ్యపరమైన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Also Read

అదేవిధంగా ఆగ్నేయాసియా దేశాల కూటమితో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం ద్వారా భారత తయారీదారుల కంటే ఆసియాన్ దేశాలే ఎక్కువ ప్రయోజనం పొందాయని.. 2025-26లో ఆసియా దేశాలతో వాణిజ్య లోటు 50 బిలియన్ డాలర్లు దాటడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటానికే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం నుంచి భారత్ దూరంగా ఉండిపోయిందని స్పష్టం చేశారు.

అంతర్జాతీయంగా అనేక అస్థిరతలు నెలకొన్న నడుమ కూడా భారతీయ ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్కెట్లను అందుకుని ముందంజ వేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. సెప్టెంబర్ నెలలో భారత వస్తు, సేవల ఎగుమతులు 23 శాతం వృద్ధి చెందడం మన ఆర్థిక వ్యవస్థ బలమైన స్థితిస్థాపకతకు నిదర్శనమని చెప్పారు.

ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో పురోగతి కోసం వేచి చూడకుండా బహుళపక్ష వ్యవస్థకు కట్టుబడుతూనే యూరోపియన్ యూనియన్, యూఏఈ, ఆస్ట్రేలియా, కెనడాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను వేగవంతం చేస్తున్నామని ఆమె తెలిపారు. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కృషితో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కూడా త్వరలోనే సాకారమవుతుందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+