రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి 1.2 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సిందిగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును భారత్ సవాల్ చేసింది. జాతీయ పన్ను వివాదంపై మధ్యవర్తిత్వానికి ఎప్పుడు అంగీకరించలేదని ఆర్థికశాఖ ఆదివారం వెల్లడించింది. ఖాతాలను జఫ్తు చేసే అవకాశం ఉండటంతో విదేశీ కరెన్సీ ఖాతాల నుండి ప్రభుత్వరంగ బ్యాంకును నిధులు ఉపసంహరించాలని ఆదేశించినట్లు వచ్చిన వార్తల్ని ఆర్థిక శాఖ కొట్టి పారేసింది.
జాతీయ పన్ను వివాదంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 120 కోట్ల డాలర్లను యూకేకు చెందిన కెయిర్న్ ఎనర్జీకి వాపస్ చేయాలనే తీర్పు చెల్లదని, అంతేకాకుండా దీనిని తాము సవాల్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే విదేశీ బ్యాంకుల్లోని విదేశీ కరెన్సీ ఖాతాలను అన్నింటిని స్వాధీనం చేసుకునే ఆలోచన ఉన్నందున ఆ బ్యాంకుల నుండి నిధులు ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ రంగంలోని బ్యాంకులకు సూచించినట్టు వచ్చిన వార్తల్ని ప్రభుత్వం తోసిపుచ్చింది.

ఇలాంటి ఆర్బిట్రేషన్‌కు అంగీకరిస్తామనే ప్రకటనగాని, ఆమోదం తెలపడంగాని భారత ప్రభుత్వం ఎప్పుడు చేసి ఉండకపోవడంతో ట్రైబ్యునల్ తన పరిధి దాటి జాతీయ పన్ను వివాదంలో జోక్యం చేసుకున్నదని వాదించింది. పన్నులు ఎగవేయాలనే దురుద్దేశంతో 2006లో కెయిర్న్ వ్యాపారాల పునర్నిర్మాణం చేశారని, ఇది పూర్తిగా భారత పన్ను చట్టాలకు వ్యతిరేక చర్య అని, దానికి ఇండియా-యూకే ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద ఎలాంటి రక్షణ ఉండబోదని తెలిపింది.
More From GoodReturns

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications