కేంద్ర ప్రభుత్వం రుణాలను సగానికి పైగా పెంచిన తర్వాత దేశంలో సావరీన్ బాండ్స్‌పై భారీ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి వరకు పదేళ్ల బాండ్స్‌పై 22 బేసిస్ పాయింట్లు పెరిగి 2017 ఫిబ్రవరి నుంచి భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరానికి రూ.12 ట్రిలియన్ల రుణాలు తీసుకుంటామని ప్రకటించారు. ఇది బడ్జెట్ అంచనా రూ.7.8 ట్రిలియన్ల కంటే చాలా ఎక్కువ.
ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ప్యాకేజీ ప్రకటించేందుకు ఈ ప్రకటన చేసి ఉంటుందని భావించినందున స్టాక్స్ భారీ లాభాల్లోకి వచ్చేశాయి. మార్కెట్ సెంటిమెంట్‌ను ఇది బలపరిచింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రుణాలు పెరుగుతుండటంతో డెట్ మార్కెట్‌కు మద్దతివ్వాలని ఆర్బీఐ చెబుతోంది. నాలుగు దశాబ్దాల్లో దేశం ఎదుర్కొని సంక్షోభం దిశగా నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ ఫండ్స్ వెనక్కి పోతున్నాయి. ఈ దశలో కార్పోరేట్ రుణగ్రహీతలు పెరిగే అవకాశముంది.
టాప్ రేటెడ్ 10 సంవత్సరాల కార్పోరేట్ నోట్ల దిగుబడి 20 బేసిస్ పాయింట్స్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏప్రిల్ 16వ తేదీన బ్లూమ్‌బర్గ్ డేటా సంకలనం తర్వాత ఇది అతిపెద్ద జంప్. కొత్త పదేళ్ల సావరీన్ బాండ్ ఆదాయాలు శుక్రవారం 5.79 శాతం కూపన్ రేటుతో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత 18 బేసిస్ పాయింట్లు లేదా 5.89 శాతం పెరిగాయి.

ప్రభుత్వం రుణాలు తీసుకోవాలనే నిర్ణయం బాండ్ మార్కెట్‌కు షాక్ తగిలిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్‌షిప్ లిమిటెడ్ చీఫ్ ఎకనమిస్ట్ అన్నారు. ఆర్బీఐ బహిరంగ మార్కెట్ కొనుగోళ్లను వేగవంతం చేయాల్సి ఉందని, ఆపరేషన్ ట్విస్ట్ ప్రోగ్రాంను మరింత పక్కాగా అమలు చేయాలని చెప్పారు.
కాగా, సెంట్రల్ బ్యాంకు సెకండరీ మార్కెట్ నుండి రూ.910 మిలియన్ల రుణాలు తీసుకుంది. ఇటీవల ఆపరేషన్ ట్విస్ట్ ప్రోగ్రామ్ ద్వారా బిల్స్ విక్రయించి బాండ్స్ కొనుగోలు చేసింది. రుణాల ద్వారా ఎలాంటి మద్దతు ఉంటుందో తెలియకుంటే బాండ్స్ అమ్మకంపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. సెంట్రల్ బ్యాంకు వేలంలో సార్వభౌమ బాండ్స్ కొనుగోలు చేయడాన్ని పరిశీలించాలని ఆర్బీఐ గవర్నర్ సహా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ పద్ధతిని 2006 నుండి చట్టం ద్వారా నిషేధించారు. అయితే ఆర్థిక లోటు లక్ష్యానికి మించితే ప్రభుత్వం ఎస్కేప్ క్లాజ్‌ను పరిశీలించవచ్చునని చెబుతున్నారు. ఆర్బీఐ బాండ్స్‌ను కొనుగోలు చేసి ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తుంది.


Click it and Unblock the Notifications