Khalistan Issue: భారత్-కెనడా సంబంధాలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కెనడాలోని ఇండియన్స్ తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలని ఖలిస్థానీ ఉగ్రవాదులు హెచ్చరించగా.. భారత ప్రభుత్వం దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
ఖలిస్థానీ తీవ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) జప్తు చేసింది. కాగా US, UK, కెనడా, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో స్థిరపడిన ఇతర ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను సైతం గుర్తిచాలని భారత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను కోరినట్లు సమాచారం.

ఇంతటితో ఆగని భారత ప్రభుత్వం.. వారు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ తరహా వ్యక్తుల ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా(OCI)ని సైతం రద్దు చేయాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా వారి ఆర్థిక వనరులపై పట్టుబిగించాలని మోదీ సర్కారు భావిస్తోందట.
అమెరికా, బ్రిటన్, కెనడా, UAE, పాకిస్థాన్ తదితర దేశాల్లో పరారీలో ఉన్న 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదులను ప్రభుత్వం గుర్తించినట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. అయితే వీరిలో ఎక్కువమంది కెనడాలోనే నివసిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ జాబితాలో గౌరవ్ పత్యాల్ లక్కీ, అన్మోల్ బిష్ణోయ్ వంటి గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications