వ్యాపార వ్యవహారాల నిర్వహణకు ప్రభుత్వ అధికారుల నుంచి ప్రైవేట్ కంపెనీలు ఎదుర్కొనే ముడుపుల బెడదపై ప్రతీ ఏటా 'ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్' సంస్థ ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ప్రకటిస్తుంది. తాజాగా ఈ ఏడాది బ్రైబరీ రిస్క్ జాబితాను వెల్లడించింది. ఆ జాబితాలో 45 స్కోర్‌తో భారత్‌కు 77వ స్థానం దక్కింది. గతేడాదితో పోల్చితే భారత్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా 194 దేశాల్లో.. అక్కడి వ్యాపార వ్యవహారాల్లో ముడుపుల ప్రభావాన్ని ఈ సంస్థ అంచనా వేస్తుంది.
ఈ విషయంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్,చైనా,నేపాల్,బంగ్లాదేశ్‌ల కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. అయితే మన పక్కనే ఉన్న భూటాన్ మాత్రం భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. 37 స్కోర్‌తో ఆ దేశం బ్రైబరీ రిస్క్ జాబితాలో 48వ స్థానంలో నిలిచింది.జాబితాలో అత్యంత అట్టడుగున.. చివరిదైన 194వ స్థానంలో సోమాలియా నిలిచింది. 2017-2019లో ఆ దేశం 187వ ర్యాంకులో ఉండగా... ఇప్పుడు మరింత దిగజారింది.

నార్త్ కొరియా,తుర్క్‌మెనిస్తాన్,సౌత్ సూడాన్,వెనిజులా,ఎరిత్రియా దేశాలు కూడా ర్యాంకింగ్స్‌లో అట్టడుగునే ఉన్నాయి. ముడుపుల రిస్క్ అతి తక్కువగా ఉన్న దేశాల్లో డెన్మార్క్,నార్వే,ఫిన్లాండ్,స్వీడన్,న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. ప్రధానంగా నాలుగు అంశాల ఆధారంగా ట్రేస్ సంస్థ ఈ ర్యాంకింగ్స్‌ను నిర్ణయిస్తుంది. అందులో ప్రభుత్వంతో వ్యాపార వ్యవహారాల సంప్రదింపులు, లంచాన్ని నిరోధించేందుకు తీసుకునే చర్యలు, ప్రభుత్వ-పౌర సేవా పారదర్శకత, మీడియా పాత్రతో సహా పౌర సమాజ పర్యవేక్షణ .వంటి అంశాలు ఉన్నాయి.
అధికారుల్లో ముడుపులు తీసుకునే సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు చైనా తీసుకున్న చర్యలు ఫలితాలనిచ్చాయని ట్రేస్ సంస్థ వెల్లడించింది.


Click it and Unblock the Notifications