మీ పిల్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు..ట్రంప్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చిన భారత్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద 25 శాతం సుంకాలను విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. దీనిపై భారత్ ప్రభుత్వం స్పందించింది. వాణిజ్య ఒప్పందాల్లో మీ దేశ రైతుల ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. అమెరికా డంప్ చేయాలని భావిస్తున్న వ్యవసాయం, పాడి పరిశ్రమల వంటి రంగాల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వాణిజ్య ఒప్పందాల్లో రైతుల ప్రయోజనాలు కాపాడటమే మా ప్రథమ కర్తవ్యమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ లోక్‌సభలో ప్రకటించారు.

దేశంలో రైతుల సంక్షేమం, ఆహార భద్రత కోసం మేము కట్టుబడి ఉన్నాం. ఇది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. మనదేశ రైతుల జీవనోపాధిని ప్రభావితం చేసే ఏ నిర్ణయానికీ మేము వెళ్లే ప్రసక్తే లేదని గోయల్ స్పష్టం చేశారు. భారతదేశంలో లక్షలాది మంది చిన్నకారు రైతులు వ్యవసాయం, పాడి పరిశ్రమలపై ఆధారపడుతున్న నేపథ్యంలో.. కేంద్రం నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ రంగాలను అమెరికాతో జరిగే వాణిజ్య ఒప్పందాల నుంచి తప్పించడమే మా ముందున్న లక్ష్యమని పియూష్ అభిప్రాయపడ్డారు.

India US trade deal India farmers protection Indian agriculture trade talks US India trade negotiations India trade agreement with US India agriculture policy farmer-friendly trade deal India US bilateral trade trade deal without hurting farmers Indian government on US trade

ఇటీవల యూఏఈ, యూకే, ఆస్ట్రేలియా, ఈఎఫ్టీఏ వంటి దేశాలతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లోనూ రైతు ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకున్నామనే సంగతిని గోయల్ గుర్తు చేశారు.రక్షణవాద ధోరణులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నా.. భారతదేశం పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంటోందని తెలిపారు. కాగా అమెరికా అధ్యక్షుడు భారత్ ఆర్థిక వ్యవస్థ చనిపోయిన ఆర్థిక వ్యవస్థ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.దీనిపై కూడా పియూష్ గోయల్ స్పందించారు.

భారత్‌ స్థిరమైన ఆర్థిక పురోగతిని తెలుసుకోకుండా అమెరికా ఈ పనికిరాని వ్యాఖ్యలు చేసిందని మండిపడ్డారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిన సంగతి ట్రంప్ కి తెలియడం లేదన్నారు. ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇప్పటికే ఎదిగిన భారత్, త్వరలో మూడవ స్థానానికి చేరుకోనుందని..ముందు ఇది తెలుసుకోవాలని గోయల్ సూచించారు.

అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక నిపుణులు, పెట్టుబడిదారులు భారత్‌ను విశ్వాసయోగ్యమైన ఆర్థిక గమ్యంగా చూస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధిలో 16 శాతం భారతదేశం నుంచే వస్తోందని.. మేక్ ఇన్ ఇండియా, విక్షిత్ భారత్ 2047 వంటి కార్యక్రమాల ద్వారా దేశాన్ని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలకమైన సంస్కరణలు చేపట్టిందని తెలిపారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందాల ప్రభావాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ రంగంలోని వాటాదారుల అభిప్రాయాలను తీసుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి గోయల్ అన్నారు.రైతులు, కార్మికులు, ఎంటర్‌ప్రెన్యూర్లు, ఎగుమతిదారులు, MSMEలను కాపాడుకునేలా నిర్ణయాలు ఉంటాయన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+