న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధానికి అంతు ఉండట్లేదు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. రెండు దేశాలు సై అంటే సై అంటోన్నాయి. రష్యా దాడిలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ప్రధాన నగరాలన్నీ ధ్వంసం అయ్యాయి. అయినా ఉక్రెయిన్ వెనక్కి తగ్గట్లేదు. యూరోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యాను ఢీ కొడుతోంది.
ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాను పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించిన విషయం తెలిసిందే. అన్ని రకాల నిషేధాజ్ఞలను జారీ చేశాయి. అనేక ఆంక్షలను విధించాయి. ఈ పరిణామాలను భారత్.. తనకు అనుకూలంగా మార్చుకుంది. రష్యాతో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అక్కడి నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుని.. దాన్ని శుద్ధి చేసి యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ఈ పరిస్థితుల మధ్య భారత్-రష్యా ఉమ్మడిగా మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేస్తోన్నాయి. ఆర్థిక కార్యకలాపాల కోసం వినియోగించే రూపే, మీర్ కార్డులను పరస్పరం తమ తమ దేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తోన్నాయి. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై ఇటీవల రెండు దేశాల మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించాయి.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, రష్యా ఉప ప్రధాన మంత్రి డెనిస్ మంటురోవ్.. పాల్గొన్న అత్యున్నతస్థాయి భేటీ ఇది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, బ్యాంక్ ఆఫ్ రష్యాకు చెందిన ఫాస్టెస్ట్ పేమెంట్ సిస్టమ్ అధికారులు దీనిపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. రూపే కార్డును భారత్‌లో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాల కోసం వినియోగిస్తోన్న విషయం తెలిసిందే. మీర్ కార్డులు- రష్యాలో చలామణిలో ఉన్నాయి.
పరస్పర అంగీకారంతో ఈ రెండు కార్డులను తమతమ దేశాల్లో వినియోగంలోకి తీసుకుని రావాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నాయి. భారత్‌లో మీర్ కార్డులు, రష్యాలో రూపే కార్డులను చలామణిలోకి తీసుకుని రావడం వల్ల ఈ రెండు దేశాల మధ్య గల ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతమౌతాయని భావిస్తోన్నాయి.

ఇది అమల్లోకి వస్తే- రష్యన్లు భారత్‌లో తమ దేశానికి చెందిన మీర్ కార్డును ఆర్థిక కార్యకలాపాల కోసం స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి వెసలుబాటు కల్పించినట్టవుతుంది. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్, యూపీఐ, భిమ్, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్, భారత్ బిల్‌పే వంటి రిటైల్ చెల్లింపుల్లో ఈ కార్డులను రష్యన్లు వాడుకోవచ్చు. అదే తరహాలో రూపే కార్డు భారతీయులు రష్యాలో వినియోగించుకోవచ్చు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications