కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ వైరస్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందుందని ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అన్నారు. ఈ మహమ్మారి నుండి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్రం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం సరిపోదన్నారు. అదే సమయంలో, జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోందని శుభవార్త చెప్పారు. ఆయన ఓ వర్చువల్ ఈవెంట్‌లో మాట్లాడారు.

దివాలా తీసిన బ్యాంకును ఆదుకోవడం వంటిది
ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై అభిజిత్ బెనర్జీ స్పందిస్తూ... ఇది దివాలా తీసిన బ్యాంకును ఆదుకోవడం లాంటిదని, ఈ ప్రభావం పరిమితంగానే ఉంటుందని, ఈ ప్యాకేజీ మరింత ఎక్కువగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. అల్పాదాయ, మధ్య తరగతి వర్గాల వద్ద మరింత డబ్బు ఉంటే తప్ప వారి వినియోగ ఖర్చులు పెరిగే అవకాశం లేదని చెప్పారు. అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం మిగతా దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పేలవంగా ఉందన్నారు. సెప్టెంబర్ త్రైమాసికం నుంచి జీడీపీ వృద్ధి రేటు కాస్త పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.

ముందే మందగమనం
కరోనా మహమ్మారికి ముందే భారత ఆర్థిక వ్యవస్థ మందగించిందని అభిజిత్ అన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ 7 శాతం ఉండగా, 2018-19లో 6.1 శాతానికి, 2019-20 ఆర్థిక సంవత్సరానికి 4.2 శాతానికి క్షీణించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు దారుణంగా పతనమవుతుందని, 2021లో ఈసారి కంటే పుంజుకుంటుందన్నారు. భారత ఆర్థిక ప్యాకేజీ పరిమితం అని, మరింత చేయాల్సి ఉందన్నారు. దేశంలో 20 ఏళ్ల అధిక ద్రవ్యోల్భణం, అధిక వృద్ధి ఉందని, గత ఇరవై సంవత్సరాల్లో స్థిరమైన అధిక ద్రవ్యోల్భణం నుండి దేశం ఎంతో ప్రయోజనం పొందిందన్నారు.

ఆత్మనిర్భర్ భారత్..
డెఫిసిట్ ఫైనాన్సింగ్ మంచి ఆలోచన అని అభిజిత్ అన్నారు. ఆర్బీఐ నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రాథమిక మార్కెట్ నుండి కొనుగోలు చేసినప్పుడు, ఎక్కువ డబ్బును ముద్రించేటప్పుడు డెఫిసిట్ మోనెటైజేషన్ జరుగుతుంది. కరోనా, లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పలువురు ఆర్థిక వేత్తలు ఇలాంటి చర్యలు సూచించారన్నారు. ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతూ.. దేశీయంగా ఇన్‌పుట్స్ కొనుగోలుతో సమస్య ఉందని, దిగుమతి చేసుకోవాల్సిన వాటిని చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రపంచంలో భారత్ మరింతగా పోటీ పడాలని అంటున్నారు.

చైనా మాదిరి..
చైనా మాదిరిగా భారత్ కూడా ఆర్థిక, మూలధనాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అభిజిత్ చెప్పారు. చిన్న పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం వాస్తవ మౌలిక సదుపాయాలు సృష్టించలేదన్నారు. వ్యవసాయ విపత్తులకు దేశంలో బీమా పథకాలు లేవన్నారు. భారతీయులు ప్రభుత్వరంగ ఉద్యోగాలపై మక్కువతో ఉన్నారని, కాబట్టి తక్కువ లాభదాయకంగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదే సమయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వరంగ ఉద్యోగాలు అవసరం అన్నారు. భారత సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, సైద్ధాంతిక విభేదాలు పక్కన పెట్టాలన్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications