2021 నాటికి భారత్‌పై కనివినీ ఎరుగని అప్పుల భారం, ఈ దేశాలకు కూడా
కరోనా మహమ్మారి కారణంగా భారత్ సహా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రభుత్వాలకు ఓవైపు ఆదాయాలు పడిపోవడంతో పాటు, మరోవైపు ఖర్చులు పెరిగాయి. దీంతో ప్రభుత్వాలు రుణాలు ఎక్కువగా తీసుకొని నెట్టుకు రావాల్సిన పరిస్థితి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అప్పుల్లో కూరుకుపోనున్నాయి. 2021 నాటికి అత్యధిక అప్పులు ఉన్న పెద్దస్థాయి వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉండనుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది.

భారీగా పెరగనున్న అప్పులు
2021 నాటికి ఎక్కువ అప్పులు ఉన్న బిగ్గెస్ట్ ఎమర్జింగ్ మార్కెట్‌లలో భారత్ ఒకటిగా ఉంటుందని మూడీస్ తెలిపింది. కరోనా కారణంగా వృద్ధి, ద్రవ్య పరిస్థితులు క్షీణించాయని, వచ్చే కొన్నేళ్లలో చాలా వరకు వర్ధమాన దేశాలు అప్పుల్లో ముగినిపోతాయని తెలిపింది. 2019 స్థాయిలతో పోలిస్తే 2021 చివరికి సగటున జీడీపీలో 10 పర్సెంటేజీ పాయింట్ల మేరకు ప్రభుత్వ రుణాలు పెరగవచ్చునని తెలిపింది. ద్రవ్యలోటు కారణంగా ఇది జరగవచ్చునని, కొన్ని దేశాల్లో అధిక వడ్డీ చెల్లింపులు, అధిక రుణాల కారణంగా ఉండవచ్చునని వెల్లడించింది.

భారత్ సహా ఈ దేశాలకు భారం
అభివృద్ధి చెందుతున్న మార్కెట్ విషయానికి వస్తే బ్రెజిల్, భారత్, సౌతాఫ్రికా వంటి దేశాల్లో అప్పుల భారం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని మూడీస్ తెలిపింది. కరోనా అనంతరం ఆదాయాలు తగ్గవచ్చునని, పర్యాటక రంగం వంటి రంగాల్లో ప్రజల్లో మార్పులు ఉంటాయని ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కొనసాగే అవకాశముందని తెలిపింది.

కరోనా దెబ్బతో..
భారత్, మెక్సికో, సౌతాఫ్రికా, టర్కీ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు, అనిశ్చిత పరిస్థితులు రుణభారాన్ని మరింతగా పెంచవచ్చునని తెలిపింది. కాగా, కరోనా కారణంగా అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏఫ్రిల్-జూన్ క్వార్టర్‌లో భారీ ప్రతికూలతను నమోదు చేశాయి. భారత్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో 23.9 శాతం క్షీణతను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications