భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులకు కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టింది. దేశీయంగా వస్తువులను తయారుచేస్తూ ప్రపంచ అగ్రగామిగా ఎదగాలనుకుంటోంది. విదేశీ ఉత్పత్తులను వీలయినంత వరకు తగ్గించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అనేక PLI (Production Linked Incentive) పథకాలను కేంద్రలోని మోదీ సర్కారు ప్రవేశపెట్టింది. భారతదేశంలో పరిశ్రమలను ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎంత కసరత్తు చేస్తున్నా ఆచరణలో సమస్యలు వస్తున్నాయి.
పెద్ద ఎగుమతి కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ కు చైనా రూపంలో ముప్పు ఇంకా తొలిగిపోవడం లేదు. చాలా వస్తువులపై మన దేశం ఇంకా చైనా మీదనే ఆధారపడుతోంది. దేశంలో సరఫరా గొలుసు ఇప్పటికీ ఎక్కువగా చైనా నుండే ఎక్కువగా నడుస్తుంది. దీంతో మేక్ ఇన్ ఇండియా కలలు నెరవేరడం లేదు. ఆది నుంచి చైనా భారత్ లో అనేక రంగాల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ప్రతి రంగంలో దాని మార్క్ పాతుకుపోయి ఉంది. ప్రతి వస్తువులో చైనా ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని తుడిపేయడానికి మోదీ సర్కారు ఎంత ప్రయత్నించినా అధి సాధ్యం కావడం లేదనే వార్తలు వస్తున్నాయి.

ఒకప్పుడు భారతదేశంలో అందరూ వాడే చాలా రకాల బొమ్మలు చైనా నుండి వచ్చేవి. భారతదేశ బొమ్మల మార్కెట్ అంతా చైనాలో తయారైన బొమ్మలతో నిండిపోయింది. అయితే ఇప్పుడు అది కాస్తా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. భారతదేశం బొమ్మల దిగుమతిని ఇప్పుడు కఠినతరం చేసింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం.. 2019- 2024 ఆర్థిక సంవత్సరం మధ్య బొమ్మల దిగుమతి దాదాపు 80 శాతం తగ్గింది. ఇది 304 మిలియన్ డాలర్ల నుండి నుండి 64.9 మిలియన్ డాలర్లకు తగ్గింది. 2019లో QCI నివేదిక భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తడంతో దానిపై చర్యలు తీసుకున్నారు.
ఇండియా బొమ్మల ఎగుమతులు: దిగుమతుల సంగతి పక్కన బెడితే ఎగుమతుల పెరుగుదల కూడా పూర్తి విజయవంతం కాలేదని చెప్పుకోవాలి. ఇండియా బొమ్మల ఎగుమతులు FY24లో పడిపోయాయి. గత సంవత్సరం 153.9 మిలియన్ డాలర్ల ఎగుమతుల నుండి 152.3 మిలియన్ డాలర్లకు పడిపోయాయి.ప్రస్తుతం చైనా నుండి తక్కువ బొమ్మలు వస్తున్నాయి బాగానే ఉంది. కానీ చాలా భాగాలు LEDలు, సర్క్యూట్ బోర్డులు, ప్లాస్టిక్‌లు, ప్యాకేజింగ్ ఇప్పటికీ చైనా నుండే వస్తున్నాయి.జూలై 2024 పాలిమర్ అప్ డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే..దేశీయ పాలిమర్‌లు దాదాపు 10 శాతం ఖరీదైనవి..అంతే కాకుండా స్థానిక పోటీతత్వాన్ని తగ్గిస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్ రంగంలో చైనా డామినేషన్: ఇక దేశంలో వృద్ధిలో దూసుకుపోతున్న మరో రంగం స్మార్ట్‌ఫోన్‌లు. FY25లో మన దేశం 24.1 బిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 55 శాతం ఎక్కువ. వాణిజ్య శాఖ ప్రకారం భారత్ ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుగా ఉంది. అంతవరకు బాగానే ఉంది కాని దీన్ని లోతుగా పరిశీలిస్తే ఇందులో కూడా చైనా డామినేషన్ ఉంది.
భారతదేశం 259.7 మిలియన్ డాలర్ల విలువైన ఫినిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లను దిగుమతి చేసుకుంది. అందులో దాదాపు 58.8 శాతం చైనా నుండే దిగుమతి అయ్యాయి. GTRI ప్రకారం చూసుకున్నట్లయితే.. అదనంగా 7.15 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్ భాగాలు విదేశాల నుండి దిగుమతి అయ్యాయి, అందులో 51.7 శాతం చైనా నుండి వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్ విడిభాగాల దిగుమతులు 763.8 మిలియన్లు ఉండగా.. అందులో 55.4 శాతం చైనా నుండి వచ్చాయి.
చైనా నుండి ఎగుమతులలో జాప్యం, టెక్నీషియన్ వీసాలలో సమస్యల వల్ల FY26 కి భారతదేశం యొక్క 32 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) హెచ్చరించింది. వచ్చే ఏడాది 32 బిలియన్ డాలర్లను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అది సాధించే సూచనలు కనపడటం లేదు. 24 బిలియన్ డాలర్ల ఎగుమతి-సంబంధిత తయారీ ఇప్పుడు ప్రమాదంలో ఉందని ICEA ఒక లేఖలో పేర్కొంది.
ఇప్పటికే దేశంలో పలు కంపెనీలు చైనా కంపెనీలతో కలిసి పని చేస్తున్నాయి. డిక్సన్ టెక్నాలజీస్.. కున్షాన్ క్యూ-టెక్ మైక్రోఎలక్ట్రానిక్స్ ఇండియాతో పాటుగా చాంగ్కింగ్ యుహై ఇండియాలో మెజారిటీ వాటాను కలిగి ఉంది. అయితే ప్రభుత్వం వాటిపై నిఘా ఉంచింది. ఆపిల్, శామ్సంగ్, షియోమి వంటి కంపెనీలు భారతదేశంలో ఫోన్లను తయారు చేస్తున్నాయి. అయితే ఫోన్ లోపల ముఖ్యమైన భాగాలు మాత్రం ఇప్పటికీ చైనా నుండే వస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పటికీ చాలా విషయాలకు మన దేశం చైనాపై ఆధారపడి ఉంది.
ఒక్క ఫోన్లు మాత్రమే కాదు, కంప్యూటర్లు, సోలార్ ప్యానెల్లు, మందులు ఇలా అనేక ఇతర రకాల వస్తువుల కోసం మనం చైనాపైనే ఆధారపడుతున్నాం. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లలో వాడే సిలికాన్ వేఫర్లు, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, కంప్యూటర్ మానిటర్లు వంటి వాటిని ఎక్కువగా చైనా నుండే కొనుగోలు చేస్తున్నాం. ఇక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో అయితే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లలో చైనాదే గుత్తాధిపత్యంగా చెప్పుకోవచ్చు.
పునరుత్పాదక శక్తి విషయానికి వస్తే.. సౌర ఘటాలు, సౌర ఫలకాలు చైనావే.. ఫార్మాస్యూటికల్స్‌లో ఎరిథ్రోమైసిన్, యాంటీబయాటిక్‌లు చైనా నుండే అధికంగా దిగుమతి అవుతున్నాయి. పారిశ్రామిక, విద్యుత్ పరికరాల విషయానికి వస్తే.. ఎంబ్రాయిడరీ యంత్రాలు, అల్యూమినియం ప్లేట్లను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో చైనా ఆధిపత్యం తగ్గించేందుకు భారత్ గట్టిగానే వ్యూహాలు రచిస్తోంది.
ఇందులో భాగంగా దేశంలోనే ఎలక్ట్రానిక్ భాగాలను తయారు చేయడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది. దీని వల్ల భారతదేశంలోనే వస్తువులు తయారవడమే కాకుండా వేలమందికి ఉపాధి లభిస్తుంది. గుజరాత్‌లో సెమీకండక్టర్ ఫ్యాక్టరీ కూడా నిర్మిస్తున్నారు. తద్వారా చైనాపై మనం తక్కువగా ఆధారపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
More From GoodReturns

Strait of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏమిటి? దీన్ని బ్లాక్ చేస్తే భారత్‌కు నష్టమేంటి?

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications