పెట్రోల్‌లో పది శాతం ఇథనాల్ కలిపి వినియోగించాలనే లక్ష్యాన్ని భారత్, అనుకున్న దాని కంటే ఐదు నెలల ముందే సాధించింది. 2025-26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తోంది.
చెరుకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారు చేసి, పెట్రోల్‌లో కలుపుతున్నారు. 2022 నవంబర్‌కు పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వరంగ చమురు రిటైల్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL) సహకారంతో ఇప్పటికే దీనిని సాధించింది.

ప్రస్తుతం దేశీయంగా పది శాతం ఇథనాల్, 90 శాతం పెట్రోల్‌ను కలిపి విక్రయిస్తున్నారు. ఇందువల్ల రూ.41,500 కోట్ల విదేశీ మారకపు ద్రవ్యం ఆదా కావడానికి తోడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు 27 లక్షల టన్నుల మేర తగ్గినట్లు అంచనా. ఇథనాల్ తయారీకి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా రైతులకు రూ.40,600 కోట్ల చెల్లింపులు జరిగాయి.
More From GoodReturns

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

Petrol prices: పెట్రోల్ బంకుల్లో కొత్త ధరలు? మీ జేబుకు ఎంత చిల్లు పడుతుందో చూడండి!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..



Click it and Unblock the Notifications