Independence Day 2025: భారతదేశం స్వాతంత్ర్యం పూర్తి చేసుకుని నేటికి 78 ఏళ్లు గడిచిపోయాయి. 79వ వసంతంలోకి భారత్ అడుగుపెడుతోంది. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ వారి కభంద హస్తాల నుంచి బయటపడి మనకు మనమే పరిపాలించుకుంటున్నాం. అయితే ఆ రోజు ఆనందంగా స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న మనం ఇప్పుడు ఎలా ఉన్నాం.. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. ఓ సారి గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. తెల్ల వాళ్ల పాలన నుండి విముక్తి సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది.
ఇంగ్లీషోడి పాలనలో వనరులు మొత్తం ఖాళీ అయ్యాయి. దేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడింది. ఎక్కడ చూసినా పేదరికమే తాండవించింది. ఇలాంటి కష్ట సమయంలో భారత మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థతో (ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం రెండూ కలిసి అభివృద్ధికి పనిచేయడం.
) దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే ప్రయత్నం చేశారు.
1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటు: 1950లో ప్రణాళికా సంఘం (Planning Commission) ఏర్పాటయింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో (1951-1956) ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ రంగాలకు నాటి ప్రధాని ప్రాధాన్యత ఇచ్చారు. భాక్రా-నంగల్ ఆనకట్ట వంటి పెద్ద ప్రాజెక్టులు ఈ మొదటి పంచవర్ష ప్రణాళికల కాలంలోనే మొదలయ్యాయి.ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని మించి ముందుక దూసుకువెళ్లింది.ఇక రెండో పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలకు ఊతం ఇచ్చారు. దీంతో దేశంలో ఉక్కు కర్మాగారాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (SAIL, BHEL, NTPC) మొదలయ్యాయి.

ఇప్పటివరకు ప్రణాళికా సంఘం ద్వారా 11 పంచవర్ష, 6 వార్షిక ప్రణాళికలు పూర్తయ్యాయి. 2015 జనవరి 1న 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో..ఈ ప్రణాళికా సంఘం స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే ఇదే సమయంలో లైసెన్స్ రాజ్ అనే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. వ్యాపారం మొదలు పెట్టాలంటే భుత్వ లైసెన్స్ తప్పనిసరి చేసింది. మొదట నియంత్రణ కోసం తెచ్చిన ఈ విధానం అనంతరం కాలంలో అవినీతి, ఆలస్యం, అభివృద్ధి మందగమనానికి కారణమైందని చెప్పుకోవచ్చు.
1960 కాలంలో హరిత విప్లవం: 1960 దశకంలో భారతదేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంది. గోధుమ, బియ్యం కోసం విదేశాల సహాయంపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో విదేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించాలని భారత్ ప్రయత్నించింది. అందులో నుంచే హరిత విప్లవం పుట్టుకు వచ్చింది. భారత ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నీటిపారుదల అభివృద్ధి ద్వారా వ్యవసాయం వైపు దేశం పయనించింది. దీని ఫలితం..ఆహార ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. అదే సమయంలో పర్యావరణ సమస్యలు, ప్రాంతీయ అసమానతలు కూడా పెరిగాయి.
1980ల ఐటీ రంగంలో విప్లవం: నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కాలంలో దేశం టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ల వైపు దృష్టిని పెట్టింది. సామ్ పిట్రోడా నేతృత్వంలో C-DOT ఏర్పాటు చేసి టెలిఫోన్ సేవలు మారుమూల గ్రామాలకీ చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పుడే రైల్వే రిజర్వేషన్ కంప్యూటరైజేషన్ మొదలైంది. అదే సమయంలో కొన్ని పరిశ్రమలపై నియంత్రణలను కూడా సడలించారు. ఇది 1990ల ఆర్థిక సంస్కరణలకు బలమైన పునాది వేసింది.
1991లో ఆర్థిక సంక్షోభం..భారీ సంస్కరణలు: 1991వ దశకంలో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.విదేశీ మారక నిల్వలు కేవలం కొన్ని వారాల దిగుమతులకు మాత్రమే సరిపడ్డాయి. ఇలాంటి సమయంలో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ భారీ సంస్కరణలు చేపట్టారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానంతో దేశాన్ని గట్టెక్కించారు. లైసెన్స్ రాజ్ రద్దు చేసి వ్యాపారాలకు స్వేచ్ఛనిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు విక్రయం ద్వారా ప్రైవేటు రంగంలో పోటీకి అవకాశం ఇచ్చారు. రూపాయి విలువ తగ్గింపు, సుంకాల తగ్గింపు, విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం వంటి ప్రపంచీకరణ పనులు చేపట్టారు. ఈ మార్పులు భారతదేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చాయి.
1991లో ఐటీ రంగంలో సవాల్: 1990 దశకం చివరలో భారత్ లో ఏర్పాటయిన ఇన్ఫోసిస్, TCS వంటి కంపెనీలు ప్రపంచ స్థాయిలో మన దేశాన్ని ఐటీ రంగంలో సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. భారత్ ఐటీ, సాఫ్ట్‌వేర్, అవుట్‌సోర్సింగ్ రంగాల్లో ప్రపంచస్థాయిలోనే అగ్రగామిగా పేరు పొందింది. వార్షిక GDP వృద్ధి 6% మించిపోయింది. ఐటీ రంగంలో ప్రపంచ దేశాలకు సవాల్ విసరగలిగింది.
2014 తర్వాత దేశంలో కొత్త ఆర్థిక దిశ: గత దశాబ్దంలో అనేక ప్రధాన ఆర్థిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం వాణిజ్యరంగంలో ప్రపంచదేశాలకు పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. దౌత్యపరంగా భారత్ సంబంధాలు మరింతగా మెరుగుపరుచుకుంది. మోదీ కాలంలో 2014లో ప్రారంభించిన జన్ ధన్ యోజన ద్వారా బ్యాకింగ్ రంగం సామాన్యులకు చేరువైంది. కోట్లాదిమంది బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసుకున్నారు. ఇక అదే ఏడాది వచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదం తయారీ రంగంలో పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించింది. అలాగే 2015లో డిజిటల్ ఇండియా నినాదంతో మారుమూల గ్రామాలకు కూడా డిజిటల్ సేవలు చేరుకున్నాయి.
UPI, GST తో మరో విప్లవం: ఇక ప్రపంచంలోనే వేగంగా పెరిగిన డిజిటల్ చెల్లింపుల విధానం UPI తీసుకువచ్చి మరో విప్లవాన్ని సృష్టించారు ప్రధాని మోదీ. ఇది 2016లో జరిగింది. ఇక దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టి కొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టారు. జీఎస్టీ విధానాన్ని 2017లో ప్రవేశపెట్టారు. ఇక 2020లో తీసుకువచ్చిన PLI పథకం తయారీ రంగానికి ప్రోత్సాహం కల్పించడంతో అభివృద్ధిలో దూసుకుపోయింది.
క్లుప్తంగా చెప్పాలంటే.. 2025 నాటికి భారత్ 4.19 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. ప్రపంచంలో నాల్గవ స్థానంలో నిలిచింది. 2028 నాటికి జర్మనీని కూడా అధిగమించే అవకాశం ఉంది. భారతదేశ ప్రయాణం స్వాతంత్ర్యం సాధించినప్పటి నుండి నేటి వరకు అనేక కష్టాల మధ్య సాగుతూ ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. నెహ్రూ కాలంలో స్టీల్ ప్లాంట్ల కొత్త ఊపు.. మన్మోహన్ సింగ్ సంస్కరణలు, నేటి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ భారత్ ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాయనేది నగ్న సత్యం. ఈ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని కోరుకుందాం.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications