Income Tax Slabs: 2024-25 ఆర్థిక సంవత్సరం మెుదలైంది. దీంతో దేశంలోని పన్ను చెల్లింపుదారులకు టాక్స్ స్లాబ్ రేట్ల నిబంధనల్లో ముఖ్యమైన మార్పులు అమలులోకి వచ్చాయి. వీటిని పన్ను చెల్లింపుదారులు తప్పక గమనించి తదనుగుణంగా తమ టాక్స్ ఫైలింగ్స్ నిర్వహించాల్సి ఉంటుంది.
పన్ను ప్రణాళికను సులభతరం చేయడం, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన బడ్జెట్ నోటిఫికేషన్‌ల ద్వారా ఈ మార్పులను అమలు చేసింది. 2024 ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఎంపికగా అమలు చేయబడుతుందని గుర్తుంచుకోవాలి. అందువల్ల పాత పన్ను విధానానికి మారాలనుకునే వారు ముందుగా దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఐటీఆర్ న్యూ టాక్స్ రీజిమ్ కింద స్వయంచాలకంగా లెక్కింపబడుతుంది..

గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రకటన సమయంలో దీనిని వెల్లడించారు. ఈ క్రమంలో కొత్త పన్ను విధానం కింద రూ.5 లక్షలుగా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని అంటే పన్ను రాయితీ మొత్తాన్ని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పన్ను స్లాబ్ రేట్లను సైతం సవరించారు. మారిన స్లాబ్ రేట్లను పరిశీలిస్తే..
- రూ.3,00,000 వరకు: 0% పన్ను
- రూ.3,00,001 నుంచి రూ.6,00,000: 5% పన్ను
- రూ.6,00,001 నుంచి రూ.9,00,000 వరకు: 10% పన్ను
- రూ.9,00,001 నుంచి రూ.12,00,000 వరకు: 15% పన్ను
- రూ.12,00,001 నుంచి రూ.15,00,000: 20% పన్ను
- రూ.15,00,000 పైన: 30% పన్ను నిర్ణయించబడింది
కొత్త పన్ను విధానం సరళతను అందించే క్రమంలో తీసుకొచ్చినప్పటికీ.. పాత పన్ను విధానం ఇప్పటికీ కొనసాగించబడుతోంది. అయితే చాలా మంది మోదీ సర్కార్ రానున్న కొన్నేళ్లలో గ్యాస్ సబ్సిడీని తొలగించినట్లే పన్ను మినహాయింపులు ఉన్న పాత టాక్స్ విధానాన్ని పూర్తిగా తీసేస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితిని పెంచినందున కొత్త పన్ను విధానం చాలా మంది పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
పాత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు వివిధ పన్ను మినహాయింపులు, పన్ను ప్రయోజనాలను పొందేందుకు సంబంధిత పత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి. అయితే కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఇలాంటి అవసరం లేదు. దీని కారణంగా పన్ను ప్రణాళిక, పన్ను దాఖలు ప్రక్రియ సులభం అవుతుందని నేటితరం యువత భావిస్తున్నారు. అలాగే.. రూ.5 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తులకు సర్‌ఛార్జ్ రేటు 37% నుంచి 25%కి తగ్గించబడింది. ఈ తక్కువ సర్‌ఛార్జ్ పన్ను రేటు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications