IT Notice: IT రిటర్న్స్ ఫైల్ చేయడానికి తుది గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో 6.77 కోట్ల మేర రిటర్నులు దాఖలయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ వాటిని మదింపు చేసే పనిలో ఉంది. కాగా ఇప్పటికే దాదాపు లక్ష మందికి నోటీసులు పంపినట్లు IT విభాగం వెల్లడించింది. మరి నోటీసు వస్తే ఏం చేయాలి, ఎలా స్పందించాలి అనే వ్యవహారంపై ఓ వెసులుబాటు లభించింది.
మీకు ఆదాయపు పన్ను నోటీసు వచ్చినప్పుడు భయపడవద్దు. మీరు చేయవలసినది ఇక్కడ ఉంది
IT డిపార్ట్‌మెంట్ నుండి ఒక నోటీసు తప్పనిసరిగా మీరు ఏదో తప్పు చేశారని అర్థం కాదు. ఇది రొటీన్ కమ్యూనికేషన్ కావచ్చు కానీ వెంటనే చర్య తీసుకోవడం చాలా అవసరం.

ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వస్తే భయపడిపోవాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రాసిక్యూషన్ కోసమే కాకుండా సందేహాల నివృత్తి, లోపాలు సరిదిద్దుకోవడం కోసమూ నోటీసు పంపించవచ్చని పేర్కొంటున్నారు. మొదటగా నోటీసుని పూర్తిగా అర్థం చేసుకుని తగిన విధంగా స్పందించాల్సి ఉంటుంది. ఒకవేళ రిప్లై ఇవ్వకుండా తేలికగా తీసుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గమనించాలి.
సాధారణంగా ఆదాయపు పన్ను విభాగం పంపించే నోటీసుల్లో వివిధ రకాలు ఉంటాయి. మరింత సమాచారం కోసం ఇన్ఫర్మేషన్ నోటీసు, మీ రిటర్న్స్ ను తనిఖీ చేయదలిస్తే ఆడిట్ నోటీసు, నిబంధనలు పాటించనట్లైతే పెనాల్టీ నోటీసులను IT విభాగం పంపిస్తుంటుంది. వీటికి తోడు పన్ను తక్కువ చెల్లించినట్లయితే జరిమానా, నోటీసుకి స్పందించకుంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ కు సైతం వెనకాడదు.
అయితే ఆయా నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు గతంలో మాదిరిగా IT ఆఫీసుకు పరుగెత్తాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఇంట్లోనే కూర్చుని IT పోర్టల్ లోని 'ఫేస్ లెస్ ట్యాక్స్ అసెస్‌మెంట్' ద్వారా వాటికి రిప్లై ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. సమాచారాన్ని సైతం ఆన్లైన్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించింది. అవసరమైతే వీడియో కాలింగ్ ద్వారా కూడా ట్యాక్స్ అధికారితో మాట్లాడవచ్చు.


Click it and Unblock the Notifications