ITR Filing Last Date News: ఈ ఏడాది (2025) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసిన ప్రకారం.. ఆ తేదీ తర్వాత మరింత పొడిగింపు తేదీ లేదని ప్రకటించారు. చాలామంది సోషల్ మీడియాలో ITR ఫైలింగ్ డెడ్‌లైన్ సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడినట్లు తెలియజేస్తున్నారు. అయితే అది నకిలీ సమాచారం మాత్రమేనని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఆ కథనాలను నమ్మవద్దని కోరింది. ఈ రోజు చివరి తేదీ అని.. పూర్తి చేయకపోతే పెనాల్టీతో పూర్తి చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇండియన్ ఆదాయపు పన్ను శాఖ 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఇప్పటివరకూ 6 కోట్లకు పైగా ITRలు అందుకున్నట్టు వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా ITR ఫైలింగ్‌లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తుంది. ఇది దేశంలోని పన్ను బేస్ విస్తరణను సూచిస్తుంది. ఈసారి కూడా ఐటీఆర్ ఫైల్ చేయని వారు పెనాల్టీ, వడ్డీ చెల్లించాల్సివస్తుంది. కాగా ఈసారి ఆదాయపు పన్ను శాఖ జూలై 31నుండి సెప్టెంబర్ 15 వరకు ITR ఫైలింగ్ డెడ్‌లైన్‌ను పొడిగించిన సంగతి విదితమే. దీని వెనుక కారణం ఐటీఆర్ ఫారమ్‌లలో కొన్ని మార్పులు, సాఫ్ట్‌వేర్ అప్డేట్లు, వినియోగదారులకు సులభతరం చేయడం. అయితే.. ఇక పొడిగింపు అవకాశం లేనందున.. చివరి నిమిషానికి వెయిట్ చేస్తే పోర్టల్‌లో స్లోడౌన్ లేదా హ్యాంగ్ అయ్యే అవకాశమున్నది. అందుకే ఇప్పుడే ఫైల్ చేయడం మంచిది.

ITR ఫైల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్: ITR ఫారమ్‌లకు డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఫైల్ చేయడానికి ముందు డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.
1.మీ ఆదాయం, TDS, TCS, ప్రాపర్టీ వివరాలు అందుబాటులో ఉండాలి
2.జీతం పొందిన వారు కంపెనీ ఇచ్చే ఫారమ్, ఇందులో జీతం మరియు TDS వివరాలు ఉంటాయి
3. రెంట్ చెల్లించినవారు HRA క్లెయిమ్ చేయాలంటే అవసరం
4.LIC, PF, డొనేషన్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నవారికి అవసరం
సరైన ITR ఫారమ్ ఎంచుకోవడం ఎలా?
ITR-1 (Sahaj): జీతం ఆదాయం ఉన్నవారు, మొత్తం ఆదాయం రూ.50 లక్షల లోపు ఉన్నవారు దీనిని ఎంచుకోవాలి.
ITR-2: ప్రొఫెషన్/వ్యాపారం ఆదాయం లేని వ్యక్తులు, HUFలు దీన్ని ఎంచుకోవాలి.
ITR-3: వ్యాపారం/ప్రొఫెషన్ ఆదాయం ఉన్న వ్యక్తులు, HUFలు
ITR-4 (Sugam): రూ.50 లక్షల లోపు ఆదాయం, సాధారణ వ్యాపార ఆదాయం ఉన్నవారు (LLP కాకుండా)
డెడ్‌లైన్ మిస్ అయితే? : సెప్టెంబర్ 15 తరువాత ITR ఫైల్ చేస్తే, అదనంగా పెనాల్టీ, వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది మీపై ఆర్థిక భారంగా మారొచ్చు. అందుకే ఈరోజే మీ ITRను ఫైల్ చేయడం చాలా ముఖ్యమని ఐటీడిపార్ట్‌మెంట్ హెచ్చరిస్తోంది. పైగా ఈ సంవత్సరపు ITR ఫైలింగ్ డెడ్‌లైన్ గురించి స్పష్టత కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 15, 2025 తర్వత పొడిగింపు లేదని స్పష్టం చేసింది.
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR)ను గడువు తేదీ తరువాత దాఖలు చేస్తే పెనాల్టీ (జరిమానా), వడ్డీలు (Interest) కూడా చెల్లించాల్సి వస్తుంది. 2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు ITRను సెప్టెంబర్ 15, 2025 వరకు తప్పకుండా ఫైల్ చేయాలి. గడువు తేదీకి తర్వాత ఫైల్ చేస్తే, ఆయా కఠిన నిబంధనలు వర్తిస్తాయి.
మీ మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే, అధికంగా రూ.1,000 జరిమానా విధించబడుతుంది. ఆదాయం రూ.5 లక్షలకు ఎక్కువ ఉంటే, రూ.5,000 వరకు జరిమానా అమలవుతుంది. ఇక సెక్షన్ 234A ప్రకారం ఆలస్యంగా ITR ఫైల్ చేసినందుకు మీరు వడ్డీ చెల్లించాలి. ఇది ప్రతి నెల ఆలస్యం అయిన భాగం మీద వర్తిస్తుంది. సెక్షన్ 234B ప్రకారం.. ట్యాక్స్ అండర్‌పేమెంట్ (చెల్లించని ట్యాక్స్)కి వడ్డీ అమలవుతుంది. సెక్షన్ 234C కింద ఇన్స్టాల్‌మెంట్‌లో ట్యాక్స్ చెల్లించకపోవడం వల్ల వడ్డీ విధించబడుతుంది. కాబట్టి ఐటీఆర్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications