Fake HRA claims: ప్రతిఏటా పన్ను చెల్లింపుల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆదాయపు పన్ను శాఖ అవలంభిస్తున్న విధానాలని చెప్పవచ్చు. గతంలో మాన్యువల్ గా చేసే పనులను ఇప్పుడు సాంకేతికత సాయంతో పూర్తి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి అక్రమాలను అడ్డుకట్ట వేస్తున్నారు. ఇదే టెక్నాలజీ తాజాగా మరో భారీ మోసాన్ని బయటపెట్టింది.
ఇంటి అద్దె(HRA) పేరిట నకిలీ అద్దె రసీదులు సమర్పింంచి ట్యాక్స్ మినహాయింపు పొందే వారికి ఆదాయపు పన్ను శాఖ గట్టి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీల సాయంతో ఇంటి యజమానులకు నోటీసులను కూడా పంపుతోంది. దీంతో వేతన జీవుల్లో ఆందోళన నెలకొంది.

పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవడమే ప్రధాన కారణంగా ఈ తరహా HRA క్లెయిమ్స్ చేస్తున్నారు. 10 లక్షల సంవత్సర ఆదాయం ఉన్న ఓ వ్యక్తి ఏడాదికి 2.40 లక్షల HRA క్లెయిమ్ చేస్తే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 7.60 లక్షలకు పడిపోతుంది. దీనివల్ల సంవత్సరానికి 1.20 లక్షల పన్ను ఆదా అవుతుంది.
పలువురు యజమానుల నుంచి HRA క్లెయిమ్ చేస్తున్న ట్యాక్స్ పేయర్స్‌ను గుర్తించేందుకు ఆదాయపు పన్ను విభాగం డేటా అనలిటిక్స్‌ని వాడుతోంది. ఇక నకిలీ అద్దె రసీదుల నమూనాల గుర్తింపునకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తోంది. ఆయా ఇళ్ల యజమానులతో అద్దె రసీదులను ధ్రువీకరించుకోవచ్చు. కాబట్టి ఇంటి అద్దె రసీదుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications