Income Tax: మూన్‌లైటింగ్ చేసిన టెక్కీలకు షాక్.. రంగంలోకి ఆదాయపుపన్ను శాఖ..
Income Tax: కరోనా కాలంలో రెండు చేతులా సంపాదించేశారు చాలా మంది తెలివైన టెక్కీలు. కంపెనీల కళ్లు కప్పి ఒకేసారి రెండు జీతాలు అందుకున్న వారిని ఇప్పుడు ఆదాయపుపన్ను శాఖ పట్టుకుంది. మెుదటి విడత చర్యలు చేపట్టింది.
మూన్‌లైటింగ్ చేసిన ఉద్యోగులు ప్రస్తుతం ఐటీ శాఖ రాడార్‌లోకి వచ్చారు. దీంతో ఈ అంశం మరోసారి చర్చల్లో నిలిచింది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ సాధారణ జీతం కంటే ఎక్కువ సంపాదించిన నిపుణులకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. ఎవరైతే తమ అదనపు ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ప్రకటించలేదో వారికి ఈ నోటీసులు వెళుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఆదాయాన్ని తక్కువగా చూపించటంపై నోటీసులు పంపుతోంది.

తొలివిడతలో ఐటీ అధికారులు దాదాపు 1,100 మందికి నోటీసులు పంపినట్లు సమాచారం. ఇందులో చాలా వరకు 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినవి అంటే కరోనా కాలానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరాల్లో రిటర్న్స్ ఫైల్ చేసిన వ్యక్తులకు నోటీసులు జారీ అయ్యాయి. మూన్‌లైటింగ్ ద్వారా వచ్చే ఆదాయం లేదా పూర్తి సమయం ఉద్యోగానికి తర్వాత పని చేయడం తరచుగా సాధారణ జీతం కంటే ఎక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరింత మందికి త్వరలోనే నోటీసులు రావొచ్చని తెలుస్తోంది.
డిజిటల్ రూపంలో చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరిగాయి. కొన్ని విదేశీ ఖాతాల నుంచి స్వీకరించబడినందున సొమ్ము విషయంలో పన్ను శాఖ ఈ అప్రకటిత ఆదాయాలను డేటా పరిశీలనలో గుర్తించింది. అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల నుంచి నెలవారీ లేదా త్రైమాసిక చెల్లింపులు పొందుతున్న ఐటి, అకౌంటింగ్, మేనేజ్‌మెంట్ నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. మెుదటి రౌండ్ లో రూ.5 నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి నోటీసులు పంపినట్లు ఆయన వెల్లడించారు. కంపెనీల వద్ద పాన్ కార్డు వివరాల ఆదారంగా అధికారులు పన్ను ఎగవేతదారులను గుర్తించేపనిలో ఉన్నారు. కరోనా సమయంలో ఐటి రంగంలో, ముఖ్యంగా ఇంటి నుంచి పని చేసే వ్యక్తుల వల్ల మూన్‌లైటింగ్ ప్రజాదరణ పొందింది.


Click it and Unblock the Notifications