Tax Notice: దేశంలో ఆదాయపు పన్ను శాఖ ప్రజలను హడలెత్తిస్తోంది. ప్రస్తుతం పన్ను అధికారులు టాక్స్ చెల్లింపుదారులకు ఎస్ఎమ్ఎస్, ఈమెయిల్స్ పంపుతున్నట్లు మంగళవారం వెల్లడించింది. దీంతో చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే అసలు టాక్స్ అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‍లో నివేదించబడిన లావాదేవీలు, 2023-24, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ITRలలో వెల్లడించిన ఆదాయం మధ్య సరిపోలని గుర్తించిన పన్ను చెల్లింపుదారులు, రిటర్న్ నాన్-ఫైలర్లకు SMS, ఈ-మెయిల్స్ పంపుతున్నట్లు పన్ను అధికారులు వెల్లడించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ AISలో నివేదించబడిన ఆదాయం, లావాదేవీలు, ఆదాయపు పన్ను రిటర్న్స్‍లో వెల్లడించిన వాటి మధ్య అసమతుల్యతలను పరిష్కరించడంలో పన్ను చెల్లింపుదారులకు సహాయపడటానికి ఎలక్ట్రానిక్ ప్రచారాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.

తాజా క్యాంపెయిన్ కింద AISలో నివేదించబడిన పన్ను విధించదగిన ఆదాయం లేదా భారీగా అధిక-విలువ లావాదేవీలను కలిగి ఉన్న వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది. హై వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్ కలిగి ఉన్నప్పటికీ పన్ను రిటర్స్ ఫైల్ చేయని వ్యక్తులను ప్రస్తుతం పన్ను శాఖ టార్గెట్ చేస్తోంది. అయితే ఇ-వెరిఫికేషన్ స్కీమ్, 2021 అమలులో భాగంగా పన్ను శాఖ ప్రస్తుతం పనిచేస్తోంది. వ్యక్తులు ఆదాయపు పన్ను అధికారిక వెబ్ పోర్టల్ లో ఉంచిన యాన్యువల్ ఇన్ఫర్మెషన్ స్టేట్మెంట్ వివరాలను చూసేందుకు వెసులుబాటు కల్పించబడింది. పైగా అక్కడ పొందుపరిచిన వివరాలపై ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకు అవకాశం కల్పించబడింది.
పన్ను కట్టని వ్యక్తుల నుంచి వసూళ్లు..
గడచిన 20 నెలలుగా ఆదాయపు పన్ను శాఖ దేశంలో పన్ను చెల్లింపు బాధ్యత కిందకు వచ్చినప్పటికి రిటర్న్ ఫైల్ చేయని వ్యక్తుల నుంచి ఏకంగా రూ.37,000 కోట్లను వసూలు చేసింది. రత్నాలు, ఆభరణాలు, ఆస్తుల కొనుగోళ్లతో పాటు నగదు రూపంలో చెల్లించిన లగ్జరీ హాలిడేస్ సహా 2019-20 నుంచి హైవాల్యూమ్ లావాదేవీల డేటాను అధికారులు విశ్లేషించారు. పెద్ద కొనుగోళ్లు చేసినప్పటికీ ప్రజలు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని సందర్భాలపై ప్రస్తుతం పన్ను అధికారులు తమ దృష్టి పెట్టారు. కఠినమైన పన్ను సేకరణ, TDS వ్యవస్థ గతంలో గుర్తించబడని ముఖ్యమైన లావాదేవీలను గుర్తించడంలో సహాయపడిందని అధికారి పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు పన్ను బాధ్యత నుంచి తప్పించుకునేందుకు జీరో ఐటీఆర్ ఫైల్ చేశారని, కానీ వాస్తవానికి వారు పన్ను చెల్లించదగిన లావాదేవీలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.4% పెరిగి రూ.12.10 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అధికారిక సమాచారం.


Click it and Unblock the Notifications