ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగులను వేధించే అతిపెద్ద ప్రశ్న.. "పాత పన్ను విధానం (Old Tax Regime) బాగుంటుందా? లేక కొత్త పన్ను విధానం (New Tax Regime) ఎంచుకోవాలా?". 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో, మీ ఆదాయంపై తక్కువ పన్ను పడాలంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవడానికి సరైన ఇన్ కమ్ ట్యాక్స్ కాలిక్యులేటర్ (income tax calculator) అవసరం. ఈ కథనంలో ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను సులభంగా అర్థం చేసుకుందాం.

2026 పన్ను నిబంధనల్లో కొత్త మార్పులేంటి?
ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, జీతాలు తీసుకునే ఉద్యోగులకు కొన్ని అదనపు ప్రయోజనాలు లభించాయి.
- హెచ్‌ఆర్ఏ (HRA): మరిన్ని నగరాల్లో ఇంటి అద్దె భత్యంపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచారు.
- మీల్ కార్డులు: సోడెక్సో వంటి మీల్ కార్డులపై ఇచ్చే పన్ను ప్రయోజనాలు పెరిగాయి.
- స్టాండర్డ్ డిడక్షన్: కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుండి రూ.75,000కు పెంచడం ఒక పెద్ద ఊరట.
పాత పన్ను విధానం (Old Regime): పెట్టుబడులే కీలకం
మీరు ఎల్‌ఐసీ (LIC), పీపీఎఫ్ (PPF), ఈఎల్ఎస్ఎస్ (ELSS) వంటి పథకాల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంటే పాత విధానమే మీకు మేలు చేస్తుంది. ఇందులో సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ (80D), హోమ్ లోన్ వడ్డీ, హెచ్‌ఆర్ఏ వంటి అనేక మినహాయింపులు పొందవచ్చు. మీ పెట్టుబడులు , మినహాయింపులు రూ.3 లక్షలు దాటితేనే ఈ విధానం లాభదాయకంగా ఉంటుంది.
కొత్త పన్ను విధానం (New Regime): సరళం , తక్కువ రేట్లు
ఎలాంటి పెట్టుబడులు లేని వారికి, పన్ను ఫైలింగ్ తలనొప్పి వద్దు అనుకునే వారికి కొత్త విధానం బెస్ట్. ఇందులో పన్ను రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కొత్త ట్యాక్స్ స్లాబ్స్ (2026) ప్రకారం..
- రూ.4 లక్షల వరకు.. పన్ను లేదు
- రూ.4L-రూ.8L.. 5%
- రూ.8L-రూ.12L.. 10%
- రూ.12L-రూ.16L.. 15%
- రూ.16L-రూ.20L.. 20%
- రూ.20L-రూ.24L.. 25%
- రూ.24 లక్షల పైన.. 30% రిబేట్ ప్రయోజనాల వల్ల రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు కొత్త విధానంలో అసలు పన్ను కట్టాల్సిన పని లేదు.
ఏ జీతానికి ఏది బెస్ట్?
- రూ.15 లక్షల ఆదాయం: సాధారణంగా కొత్త విధానంలోనే పన్ను తక్కువ పడుతుంది. మీరు రూ.3 లక్షల పైన డిడక్షన్స్ చూపిస్తేనే పాతది మేలు.
- రూ.30 లక్షల ఆదాయం: ఇక్కడ మీ సేవింగ్స్ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. పాత విధానంలో గరిష్ట మినహాయింపులు పొందితే పన్ను ఆదా చేయవచ్చు, లేదంటే కొత్తదే సులభం.
- రూ.50 లక్షల పైన: అధిక ఆదాయం ఉన్నవారికి కొత్త విధానంలో సర్‌చార్జ్ తక్కువగా ఉండటం ఒక అడ్వాంటేజ్.
చివరగా చెప్పాలంటే అందరికీ ఒకే విధానం సరిపోదు. మీ దగ్గర హోమ్ లోన్ ఉండి, ఇన్సూరెన్స్ , ఇతర సేవింగ్స్ ఎక్కువగా ఉంటే పాత విధానం వైపు మొగ్గు చూపండి. ఏ టెన్షన్ లేకుండా ఎక్కువ జీతం చేతికి రావాలి అనుకుంటే కొత్త విధానం ఎంచుకోండి. పన్ను ఫైల్ చేసే ముందు ఖచ్చితంగా ఆన్‌లైన్ ఇన్ కమ్ ట్యాక్స్ కాలిక్యూలేటర్ (income tax calculator) ఉపయోగించి రెండు పద్ధతుల్లో పన్నును లెక్కించుకుని, మీకు ఏది తక్కువగా ఉంటే దాన్నే ఫైనల్ చేయండి. సరైన ప్లానింగ్ ఉంటేనే మీ కష్టార్జితాన్ని పన్ను రూపంలో వృధా కాకుండా కాపాడుకోగలరు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications