Budget 2024: కొత్త బడ్జెట్లో 4 పన్ను ప్రయోజనాలొచ్చే అవకాశం..! నిర్మలమ్మ చేతిలో నిర్ణయం
Income Tax: కొత్త ఏడాదిలో ప్రతి ఏటా మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. మరోపక్క ఎన్నికలు సైతం దగ్గరపడుతున్న వేళ పన్ను చెల్లింపుదారుల్లో సైతం కొత్త ప్రకటనల గురించి ఆశలు చిగురిస్తున్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1,2024న సమర్పించనున్నారు. అయితే ప్రధాన ప్రకటనలు లోక్‌సభ ఎన్నికల తర్వాతే ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీర్ఘకాలిక ఆందోళనలను పరిష్కరించడానికి, భవిష్యత్ ఆర్థిక వృద్ధికి వేదికను ఏర్పాటు చేయడానికి అవకాశాన్ని అందిస్తుందని, ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తుందని క్లియర్‌టాక్స్ సీఈవో అర్చిత్ గుప్తా పేర్కొన్నారు. ఈ సారి బడ్జెట్ 2024 నుంచి ఆదాయపు పన్ను ప్రయోజనాల అంచనాలను పరిశీలిస్తే..

సెక్షన్- 80D డిడక్షన్స్..:మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం సెక్షన్ 80D కింద తగ్గింపు పరిమితిని వ్యక్తులకు రూ.25,000 నుంచి రూ.50,000కి; సీనియర్ సిటిజన్‌లకు రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచాలి. ద్రవ్యోల్బణంతో పాటు మార్కెట్లో పెరుగుతున్న వైద్య ఖర్చుల సమయంలో ప్రజలు ఎక్కువ తగ్గింపులను కోరుకుంటున్నారు. పైగా ప్రయోజనాలను పొడిగించడం వల్ల ఆరోగ్య సంరక్షణకు సమానమైన ప్రాప్యతను ప్రోత్సహిస్తుందని అర్చిత్ గుప్తా అన్నారు.
గృహ కొనుగోలుదారులకు TDS కంప్లయన్స్ సులభతరం.. :ప్రస్తుతం రూ.50 లక్షలకు మించిన ఆస్తి కొనుగోళ్లపై 1% TDS తీసివేయబడుతుంది. ఈ ప్రక్రియ రెసిడెంట్ అమ్మకందారులకు (ఫారమ్ 26QB ఉపయోగించి) నేరుగా ఉన్నప్పటికీ, నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) విక్రేతలకు ఇది మరింత క్లిష్టంగా మారుతుందని గుప్తా చెప్పారు.
క్యాపిటల్ గెయిన్స్ పన్ను సరళీకరణ..:ప్రస్తుత మూలధన లాభాల పన్ను విధానం సంక్లిష్టత పెట్టుబడిదారులకు సవాళ్లను కలిగిస్తుంది. అసెట్ క్యాటగిరీలు, హోల్డింగ్ పీరియడ్‌లు, పన్ను రేట్లు, నివాస స్థితి వంటి అనేక అంశాలను పరిగణించాలి. ప్రభుత్వం లిస్టెడ్, అన్‌లిస్టెడ్ సెక్యూరిటీలకు పన్ను ప్రక్రియను ఏకీకృతం చేయాలని, ఇండెక్సేషన్ నిబంధనలను సులభతరం చేయాలని గుప్తా అన్నారు.
బెంగళూరు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు..:భారత రాజ్యాంగం ద్వారా మెట్రో నగరంగా గుర్తించబడినప్పటికీ.. ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం బెంగళూరు నాన్-మెట్రోగా వర్గీకరించబడింది. ఇది దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఉద్యోగులకు లభించే 50% మినహాయింపులకు బదులుగా అక్కడ నివాసితులకు HRA తగ్గింపులను 40%కి పరిమితం చేస్తుంది. అయితే దీనిని ఖచ్చితంగా మార్చాలని చాలా మంది ఉద్యోగులు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications