ఈ నెలతో 2022 సంవత్సం ముగుస్తుంది. వచ్చే సంవత్సరం ఆర్థిక ప్రణాళిక వేసుకోండి. ఎక్కువగా బ్యాంకు వెళ్లే వారు బ్యాంకు సెలవులు తెలుసుకోండి. సాధారణంగా, జాతీయ సెలవులు, పండుగలు, ఆదివారాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసిఉంటాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రతినెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ సెలవుల్లోనే కాకుండా కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే స్థానిక పండుగల సమయంలో కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సందర్భంలో బ్యాంకుల స్థానిక శాఖలు మాత్రమే మూసివేస్తారు.

RBI నిబంధనలు
RBI నిబంధనల ప్రకారం సెలవులను మూడు వర్గాలుగా వర్గీకరించారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంకుల ఖాతాల చివరి ఆర్థిక అకౌంటింగ్ వ్యవధి మూడు సెలవు వర్గీకరణలు. 2023లో బ్యాంక్ కు ఏ రోజు సెలవు ఉందో చూద్దాం..

జనవరి నుంచి మార్చి బ్యాంకులకు సెలవు
జనవరి 26, 2023: గురువారం: గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18, 2023: శనివారం, మహా శివరాత్రి
మార్చి 8, 2023: బుధవారం, హోలీ
మార్చి 22, 2023: బుధవారం, ఉగాది
మార్చి 30, 2023: గురువారం, రామ నవమి

ఏప్రిల్ నుంచి జూలై వరకు బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 7, 2023: శుక్రవారం, గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14, 2023: శుక్రవారం, డాక్టర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 22, 2023: శనివారం, ఈద్-ఉల్-ఫితర్(రంజాన్)
మే 1, 2023: సోమవారం, మే డే/ కార్మిక దినోత్సవం
జూన్, 29, 2023: గురువారం, బక్రీద్/ఈద్ అల్ అదా
జూలై 29, 2023: శనివారం, ముహర్రం

ఆగస్టు, సెప్టెంబరు బ్యాంకులకు సెలవు
ఆగష్టు 15, 2023: మంగళవారం, స్వాతంత్ర్య
సెప్టెంబర్ 7, 2023: గురువారం, జన్మాష్టమి/కృష్ణ జన్మాష్టమి

అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 2, 2023: సోమవారం, గాంధీ జయంతి
అక్టోబర్ 24, 2023: మంగళవారం, విజయ దశమి
నవంబర్ 12, 2023: ఆదివారం, దీపావళి
నవంబర్ 27, 2023: సోమవారం, గురునానక్ జయంతి
డిసెంబర్ 25, 2023: సోమవారం, క్రిస్మస్
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications