Small Cap Mutual Funds: సెప్టెంబర్‌లో అత్యధికంగా పెట్టుబడులు సాధించిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
సెప్టెంబర్ లో స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి రూ.9,039 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలలోకెల్లా అత్యధికం. అయితే అత్యధిక నిధులను అందుకున్న 3 స్మాల్ క్యాప్ ఫండ్లలో మధ్య ఒక ఆసక్తికరమైన వ్యత్యాసం వెలుగులోకి వచ్చింది. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్, నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అన్నీ ఆ నెలలో ప్రతికూల రాబడులను అందించినప్పటికీ, పెట్టుబడిదారులు వాటిలో డబ్బు పెట్టడం కొనసాగించారు. వాటి పోర్ట్‌ఫోలియోలను నిశితంగా పరిశీలిస్తే ఈ 3 ఫండ్‌లు గణనీయంగా విభిన్నమైన పెట్టుబడి విధానాలను అనుసరిస్తున్నాయని తెలుస్తోంది.
బంధన్ తన ఆస్తులలో దాదాపు 13 శాతం నగదు ఉంచుకుంటూ.. ఫైనాన్షియల్ కంపెనీలలో తన వాటాలను పెంచుకుంది. ఇన్వెస్కో సాపేక్షంగా కేంద్రీకృతమైన పోర్ట్‌ఫోలియోలో కొత్త బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ స్టాక్‌ల్లో పెట్టుబడి పెట్టగా.. నిప్పన్ తన పెట్టుబడులను 250కి పైగా స్టాక్‌లలో విస్తరించడం కొనసాగించింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ప్రకారం ఆగస్టులో రూ.7,973.33 కోట్ల నికర పెట్టుబడులు రాగా, సెప్టెంబర్‌లో స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ రూ.9,038.57 కోట్ల నికర పెట్టుబడులను స్వీకరించాయి. విస్తృత ఈక్విటీ మార్కెట్‌లో బలహీనత ఉన్నప్పటికీ, కేవలం ఒక నెలలోనే ఇది దాదాపు 13.4% పెరుగుదలను సూచిస్తుంది.

సెప్టెంబర్‌లో, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సుమారు 3.12% క్షీణించగా, నిఫ్టీ 50 6.06% పడిపోయింది. స్మాల్-క్యాప్ స్టాక్‌లు సాధారణంగా ప్రమాదకరమైన పెట్టుబడులుగా పరిగణించబడినప్పటికీ, ఈ ప్రత్యేక నెలలో పెద్ద కంపెనీల కంటే చిన్న కంపెనీలు సాపేక్షంగా మెరుగైన పనితీరును కనబరిచాయి. సెప్టెంబర్‌లో ఈ 3 పథకాలు ప్రతికూల రాబడులను నమోదు చేసినప్పటికీ దీర్ఘకాలంలో వాటి పనితీరు భిన్నమైన పని తీరును కనబరిచాయి. ఆ నెలలో బంధన్ అతి తక్కువగా 1.50% క్షీణతను నమోదు చేయగా, ఇన్వెస్కో 3.78%తో అత్యధిక క్షీణతను చవిచూసింది. అయితే ఇన్వెస్కో గత 6 నెలల్లో అత్యధిక సాధారణ రాబడిని అందించింది. పెట్టుబడిదారులు స్కీమ్‌లో డబ్బు పెట్టడం కొనసాగించినప్పటికీ నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ AUMలో వ్యతిరేక కదలికను చవిచూడాల్సి వచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications