RBI Gold: వామ్మో.. కొండంత బంగారం కొనేసిన రిజర్వు బ్యాంక్..! గ్రాముల్లో కాదు టన్నుల్లో..
Gold News: భారతీయులకే కాదు భారతీయ రిజర్వు బ్యాంకు సైతం బంగారం కొనటం అంటే ఎక్కువ మక్కువే. ఇటీవల పసిడి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూడా ఆర్బీఐ టన్నుల్లో బంగారాన్ని కొనుగోలు చేసి రికార్డుల మోత మోగిస్తోంది.
రిజర్వు బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో తొమ్మిది టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్‌లు మెుత్తంగా 337 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. దీంతో ఆయా దేశాల వద్ద బంగారం నిల్వలు గత త్రైమాసికంలో భారీగా పెరిగిపోయాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(WGC) ప్రకారం భారత్ వద్ద అధికారికంగా సెప్టెంబర్ చివరి నాటికి గోల్డ్ నిల్వలు 806.7 టన్నులకు చేరుకున్నాయి.

ఈ ఏడాది ఇప్పటి వరకు ఇండియా 19.3 టన్నుల కొనుగోలు చేసింది. 2017 నుంచి ఇప్పటి వరకు భారతీయ సెంట్రల్ బ్యాంక్ మెుత్తంగా 248.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా వెల్లడించింది. భారతదేశం మొత్తం ఫారెక్స్ నిల్వలు సెప్టెంబర్ 29 నాటికి 586.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వీటిలో కేవలం బంగారం విలువ మాత్రమే 43.7 బిలియన్ డాలర్లుగా నిలిచింది.
ఎంత కరెన్సీని కలిగి ఉండాలి, ఎంత మొత్తాన్ని కలిగి ఉండాలి అనే విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంతర్గత విధానాన్ని కలిగి ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ పేర్కొన్నారు. అమెరికా ట్రెజరీ దిగుబడులు, డాలర్ రేటు తగ్గినప్పుడు బంగారం వైవిధ్యభరితంగా పనిచేస్తుందని అన్నారు. ప్రధానంగా విదేశీ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరతల కారణంగా రిజర్వు బ్యాంక్ బంగారం నిల్వలను తన వ్యూహాలకు అనుగుణంగా పెంచుకుంటోందని ఆనంద్‌రాతి గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ సుజన్ హజ్రా అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications