Personal Income Tax: చాలా కాలంగా దేశీయంగా పన్ను చెల్లింపుదారుల నుంచి ఒకటే అభ్యర్థన వినిపిస్తోంది. అదే పన్ను రహిత ఆదాయ పరిమితి పెంపు. గత ఏడాది ఎన్నికలు ఉండటంతో మధ్యతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఈ వ్యవహారం కొంత పక్కన పెట్టబడింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి ఉద్యోగుల వరకు అందరి నుంచి పన్ను తగ్గింపుల కోసం వినతులు పెరుగుతున్నాయి.
మరో వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో న్యూ టాక్స్ రీజిమ్ కింద వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు ఉండే వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండబోదని తెలుస్తోంది. బిజినెస్ స్టాండర్ట్ రిపోర్ట్ ప్రకారం ఈమేరకు ఆర్థిక మంత్రి కొత్తగా రూ.15-20 లక్షల మధ్య ఆదాయ వర్గం కోసం 25 శాతం శ్లాబ్ రేటును ప్రవేశపెట్టనున్నట్లు నివేదించింది.

శాలరీడ్ టాక్స్ పేయర్లు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ నుంచి రెండు పన్ను విధానాల కింద రాయితీలు, పన్ను తగ్గింపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త టాక్స్ రీజిమ్ కింద రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉండగా.. రూ.7.75 లక్షల వరకు ఉండే ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికింద అత్యధిక పన్ను రేటు 30 శాతం వరకు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిలో మార్పులను చేసేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిగణిస్తోందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం పన్ను రహిత ఆదాయ పరిమితిని పెంచటం ద్వారా కలిగే రూ.50,000 నుంచి లక్ష కోట్ల వరకు నష్టాన్ని గ్రహించటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.5.7 లక్షలకు పెంచాలని థింక్ ట్యాంక్ సూచించింది. 2025 నాటికి సేవింగ్స్ వడ్డీకి రూ.10,000 తగ్గింపును రూ.19,450కి పెంపు, బీమా ప్రీమియంలు, పీఎఫ్ సహకారాలకు రూ.1.5 లక్షల తగ్గింపును రూ.2.6 లక్షలకు సర్దుబాటు చేయాలని సూచించింది. ద్రవ్యోల్బణం ఆధారిత పన్ను స్లాబ్‌లు, మినహాయింపుల అవసరాన్ని థింక్ ట్యాంక్ నొక్కి చెప్పింది.
గత బడ్జెట్ మాదిరిగా కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూలధన లాభాల పన్ను పెంపు రూపంలో దేశ ప్రజలకు షాక్ ఇవ్వబోరని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వృద్ధి దెబ్బతిన్న సమయంలో వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం కొన్ని పన్ను చర్యలను పరిశీలించగలిగినప్పటికీ.. ఆదాయాలను పునరుద్ధరించడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఉండవచ్చని వారు చెబుతున్నారు. అసోచాం కూడా ప్రజల వద్ద ఖర్చుచేసేందుకు చేతిలో ఆదాయం ఎక్కువగా ఉండేలా చూడాలని, అందుకోసం ఆదాయపు పన్ను పరిమితుల విషయంలో ఉదారంగా కేంద్రం వ్యవహరించాలని సూచించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications